Hi Nanna:ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి.. హాయ్ నాన్న నుంచి ఫీల్‌గుడ్ సాంగ్..

  • IndiaGlitz, [Saturday,November 04 2023]

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ప్రాణం అల్లాడి పోదా.. అమ్మాడి’ అంటూ పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ఫీల్‌గుడ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటను సుభాష్ గోపాలన్, కాళ భైరవ ఆలపించగా.. హేషమ్ అబ్బుల్ వాహబ్ సంగీతం అందించారు. మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) నానికి జంటగా నటిస్తుండగా.. బేబి కియారా ఖన్నా కుమార్తె పాత్రలో కనిపించనుంది.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హాయ్ నాన్న టైటిల్ సాంగ్, గాజు బొమ్మ పాటలు చార్ట్ బ్లాస్టర్‌గా నిలిచిపోయాయి. కూతురి సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కెతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కెరీర్‌లో 30వ చిత్రంగా రూపొందించిన ఈ మూవీ డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక నాని తన 31వ చిత్రాన్ని వివేక ఆత్రేయ దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. 'సరిపోదా శనివారం' అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు నెలకొనేలా చేసింది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక్కరోజు సరిపోదా.. ఆ ఒక్కరోజే శనివారం అయితే.. అంటూ డైలాగ్ కింగ్ సాయికుమార్ చెప్పిన వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటిస్తున్నారు.

More News

Purandeshwari:సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సీజేఐకి పురందేశ్వరి లేఖ..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, వైసీపీ నేతల మధ్య రోజురోజుకు రాజకీయ దుమారం రేగుతోంది.

Guntur Karam:‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ఆడియో క్లిప్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Bigg Boss Telugu 7 : శోభాను గెలిపించిన అమర్‌దీప్ .. ఈ సీజన్‌లో తొలి లేడీ కెప్టెన్‌గా డాక్టర్ మోనిత, శివాజీపై గౌతమ్ ఫిర్యాదు

బిగ్‌బాస్ 7 తెలుగులో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఇంటి సభ్యులు వీర సింహాలు, గర్జించే పులులుగా విడిపోయి టాస్క్‌ల్లో పాల్గొంటున్నారు.

MIM Party:ఎంఐఎం పార్టీ కీలక ప్రకటన.. 9 స్థానాల్లో పోటీకి సై..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీపై ఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంచుకోట స్థానాలైన ఏడు నియోజకవర్గాలతో

AP Cabinet:కులగణనకు గ్రీన్ సిగ్నల్.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.