Hi Nanna:ప్రాణం అల్లాడి పోదా అమ్మాడి.. హాయ్ నాన్న నుంచి ఫీల్‌గుడ్ సాంగ్..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna) నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘ప్రాణం అల్లాడి పోదా.. అమ్మాడి’ అంటూ పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ ఫీల్‌గుడ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటను సుభాష్ గోపాలన్, కాళ భైరవ ఆలపించగా.. హేషమ్ అబ్బుల్ వాహబ్ సంగీతం అందించారు. మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నానికి జంటగా నటిస్తుండగా.. బేబి కియారా ఖన్నా కుమార్తె పాత్రలో కనిపించనుంది.
వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన హాయ్ నాన్న టైటిల్ సాంగ్, గాజు బొమ్మ పాటలు చార్ట్ బ్లాస్టర్గా నిలిచిపోయాయి. కూతురి సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కెతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కెరీర్లో 30వ చిత్రంగా రూపొందించిన ఈ మూవీ డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక నాని తన 31వ చిత్రాన్ని వివేక ఆత్రేయ దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. 'సరిపోదా శనివారం' అనే పేరుతో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇందుకు సంబంధించి విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు నెలకొనేలా చేసింది. "శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక్కరోజు సరిపోదా.. ఆ ఒక్కరోజే శనివారం అయితే.." అంటూ డైలాగ్ కింగ్ సాయికుమార్ చెప్పిన వాయిస్ ఓవర్ ఆకట్టుకుంది. ఈ మూవీలో నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com