సెప్టెంబర్ లో ప్రకాష్ రాజ్ చిత్రం...
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటుడుగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తుండే సంగతి తెలిసిందే. అలాంటి ప్రకాష్ రాజ్ దర్శక నిర్మాణంలో ఇప్పుడు మనవూరి రామాయణం` చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ పిక్చర్స్ బ్యానర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందట, సెన్సార్ పూర్తి చేసుకోవడానికి సినిమా సిద్ధమైంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ప్రకాష్ రాజ్ ఈ సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు.
ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. తెలుగులో మనవూరి రామాయణం, కన్నడలో ఇదోల్లె రామాయణ అనే టైటిల్‌తో సినిమా విడుదల అవుతుంది. సెన్సార్ కూడా పూర్తయిన తర్వాతే ప్రకాష్ రాజ్ విడుదల తేదిని అనౌన్స్ చేసి దానికి తగిన విధంగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తాడట. అయితే ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com