లోకసభకు సై అంటున్న ప్రకాష్ రాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కొత్త సంవత్సర వేడుక సందర్భంగా ఓ సంచలన ప్రకటన చేశారు. అదేంటంటే.. ఈ ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
అయితే ఏ నియోజక వర్గం నుండి పోటీ చేయబోతాననేది త్వరలోనే ప్రకటిస్తానని కూడా ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎప్పటి నుండో తాను రాజకీయాల్లోనే ఉన్నానని ప్రకటించిన ప్రకాష్ రాజ్ ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నట్లు ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రకాష్ అక్కడి ప్రజలకు అవసరమైన వసతుల రూపకల్పనకు కృషి చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com