క్షోభపెడుతున్నారు.. మాపై మీ ఆధిపత్యమేంటీ: పవన్‌కు అండగా నిలిచిన ప్రకాశ్ రాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా నటించిన ‘‘భీమ్లా నాయక్’’ సినిమా ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పవన్ , రానాల నటన, పాటలు, డైలాగ్స్, ఫైట్స్ అన్ని ఈ సినిమా విజయానికి దోహదపడ్డాయి. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు బ్రహ్మారథం పడుతున్నారు. అయితే ఏపీలో మాత్రం భీమ్లా నాయక్‌కు గడ్డు పరిస్ధితులు ఎదురవుతున్నాయి. తక్కువ రేట్లకు టికెట్లు విక్రయించడంతో పాటు ఐదవ ఆటకు ప్రభుత్వం వీలు కల్పించకపోవడంతో సినిమా హిట్టయినా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కలెక్షన్లు రావడం లేదు. ఏపీ సర్కార్ తీరుపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. సినిమాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు బ్యానర్లు బెజవాడ నడిబొడ్డున పెట్టి హంగామా సృష్టిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వానికి భయపడి సినీ పరిశ్రమ నుంచి కూడా భీమ్లా నాయక్‌కు మద్ధతు లభించడం లేదు. ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌పై పగతో ఇలా చేస్తున్నప్పటికీ సినీ పరిశమ్ర నుంచి, సినీ పెద్దలు నుంచి మద్దతు రాకపోవడం శోచనీయం. ఇలా చేయడం తప్పు అని చెప్పడం కానీ, ట్వీట్స్ వేయడం కానీ ఎవరూ చేయడం లేదు. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌కు సినీ పరిశ్రమ అండగా నిలవకపోవడం దారుణమన్నారు.
ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ భీమ్లా నాయక్‌కు అండగా నిలిచారు. ' ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భీమ్లా నాయక్ చిత్రంపై దాడి ఆపాలి. సినిమాని ఎదగనివ్వండి. సృజన, సాంకేతికత మేళవించిన చిత్ర పరిశ్రమపై అధికార దుర్వినియోగం, అధిపత్యధోరణి ఏమిటి ? చిత్ర పరిశ్రమని క్షోభపెడుతూ మేము ప్రోత్సహిస్తున్నాము అంటే నమ్మాలా ? ఏదైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. బాక్సాఫీస్ వద్ద కక్ష సాధింపులు ఎందుకు ? ఎంత ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల అభిమానానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#BheemlaNayak .. #GovtofAndhrapradesh please put an end to this onslaught..let cinema thrive ????????????#JustAsking pic.twitter.com/eZxpVYYZbI
— Prakash Raj (@prakashraaj) February 27, 2022
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout