వరుణ్ తేజ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. హీరోయిన్ల ఎంపికను చేపట్టారు. అందులో భాగంగానే ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్న ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్గా అదితి రావ్ హైదరిని ఎంపిక చేయగా.. సెకండ్ హీరోయిన్గా కావ్యా థాపర్ పేరు పరిశీలనలో ఉంది. అవడానికి సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా.. ప్రాధాన్యమున్న పాత్ర అనీ.. ఇద్దరు నాయికలున్నా సినిమాలో పాటలు మాత్రం ఉండవని చిత్ర బృందం చెబుతోంది.
అలాగే.. ఈ సినిమాలో సైంటిస్ట్ పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారని సమాచారం. వరుణ్ వ్యోమగామిగా కనిపిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి.. నగర శివార్లలో స్పేస్‌ను తలపించే విధంగా ప్రత్యేక సెట్ కూడా వేస్తున్నారని తెలిసింది. ఈ సెట్ లోనే అత్యధిక భాగం చిత్రీకరణజరగబోతోంది. తక్కువ బడ్జెట్లో.. అతి తక్కువ రోజుల్లో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com