వరుణ్ తేజ్ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటంటే..

  • IndiaGlitz, [Thursday,March 29 2018]

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి  కాంబినేష‌న్‌లో ఓ సినిమా  తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. హీరోయిన్‌ల ఎంపికను చేపట్టారు. అందులో భాగంగానే ఇద్దరు హీరోయిన్‌లకు ఛాన్స్ ఉన్న ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్‌గా అదితి రావ్‌ హైదరిని ఎంపిక చేయగా.. సెకండ్ హీరోయిన్‌గా కావ్యా థాపర్ పేరు పరిశీలనలో ఉంది. అవడానికి సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా.. ప్రాధాన్యమున్న పాత్ర అనీ.. ఇద్దరు నాయికలున్నా సినిమాలో పాట‌లు మాత్రం ఉండవని చిత్ర బృందం చెబుతోంది.

అలాగే.. ఈ సినిమాలో సైంటిస్ట్ పాత్రలో విల‌క్ష‌ణ‌ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారని సమాచారం. వరుణ్ వ్యోమగామిగా కనిపిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి.. నగర శివార్లలో స్పేస్‌ను తలపించే విధంగా ప్రత్యేక సెట్‌ కూడా వేస్తున్నార‌ని తెలిసింది. ఈ సెట్ లోనే అత్యధిక భాగం చిత్రీకరణజరగబోతోంది.  తక్కువ బడ్జెట్‌లో.. అతి తక్కువ రోజుల్లో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది.

More News

అంగరంగ వైభవంగా ఎన్టీయార్ ప్రారంభోత్సవం

ప్రతి తెలుగువాడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం "ఎన్టీయార్" బయోపిక్.

ఎన్టీఆర్ సినిమాలో జగపతి బాబు పాత్ర ఇదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ పూజా హెగ్డే జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగ‌తి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

రంగస్థలంకి ఇంటర్వెల్ బాంగ్ హైలైట్ అట‌

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

యంగ్ హీరోతో సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్?

భిన్నమైన కథలతో.. వైవిధ్యమైన కథనంతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట ద‌ర్శ‌కుడు సుకుమార్.

రాజమౌళికి అరుదెన ఆహ్వానం

'బాహుబలి' సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని  పెంచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఈ సినిమా మేకింగ్ రాజమౌళి అండ్ టీంకి ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది.