ప్రకాష్ రాజ్ అసహనం

  • IndiaGlitz, [Tuesday,October 03 2017]

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ అవార్డుల‌ను వెన‌క్కిచ్చేస్తాన‌ని తెలిపారు. ప్ర‌కాష్ రాజ్ కోపానికి కార‌ణం గౌరీ లంకేష్ హ‌త్య‌. కొన్ని రోజుల క్రితం బెంగ‌ళూరులో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ గౌరీ లంకేష్‌ను కొంద‌రు దుండ‌గులు హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. పోలీసులు హంత‌కులెవ‌రో ఇంత వ‌ర‌కు అరెస్ట్ చేయ‌లేదు. దీనిపై స్పందించిన ప్ర‌కాష్ రాజ్‌, గౌరీ లంకేష్ హత్య‌ను సోష‌ల్ మీడియాలో పండుగ‌లా సెలబ్రేట్ చేసుకున్న‌దెవ‌రో మ‌న‌కు తెలిసిందే. ఉద్దేశ‌మేంటో కూడా తెలుసు. దేశం ఎటుపోతుందో అర్థం కావ‌డం లేదన్న ఆయ‌న‌, త‌న‌కు ఐదు అవార్డులు వ‌చ్చాయని, వాటిని వెన‌క్కిచ్చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఓ ర‌కంగా ప్ర‌కాష్ రాజ్ ప్ర‌భుత్వంపై త‌న అస‌హనాన్ని వ్య‌క్తం చేశారు.