సీసాలతో కొట్టడమేంటి.. చంపేస్తారా..? : ప్రకాష్ రాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బిగ్ బాస్-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కొన్నిరోజుల క్రితం పబ్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రిషిక్ రెడ్డి గచ్చిబౌలిలోని పబ్‌లో దాడి చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆ తర్వాత తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఇంతవరకూ నిందితుడిని పట్టుకున్నట్లు కానీ.. కఠిన చర్యలు తీసుకున్నట్లు గానీ ఒక్క వార్త కూడా రాలేదు. ఈ క్రమంలో ఏకంగా టాలీవుడ్ విలన్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగాడు. తాను రాహుల్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
మేమంతా ఉన్నాం..
సోమవారం నాడు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను రాహుల్, ప్రకాశ్ రాజ్ కలిశారు. ఈ మేరకు జరిగిన విషయం అంతా దాస్యంకు నిశితంగా వివరించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ కు ఎవరూ లేరని అనుకోవద్దని... తామంతా ఆయన వెనక ఉన్నామన్నారు. ‘పబ్‌కు వెళ్లడంలో తప్పు లేదు.. కొట్టి చంపేస్తారా?. ఓ వ్యక్తిని పబ్లిక్‌లో సీసాలతో దాడి చేస్తారా.. ఏమిటా ధైర్యం. రాహుల్‌పై దాడిచేయడం తప్పు.. అతడి వెంట మేమంతా ఉన్నాం. జరిగిన గొడవలో రాహుల్ తప్పు లేదు. దాడి చేసిన వారికి శిక్ష పడాల్సిందే. పబ్‌లకు వెళితే సీసాలతో అలా కొట్టడమేంటి..? చంపేస్తారా..? ఆ అహంకారం తప్పు.. ఒకడ్ని పట్టుకుని పది మంది కొడతారా..? ఏంటిది..?’ అని ప్రకాష్ రాజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. అంతటితో ఆగని ఆయన.. వినయ్ భాస్కర్‌ను కలవడానికి.. ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. మరీ ముఖ్యంగా కేసు కాంప్రమైజ్ కోసం వినయ్ భాస్కర్‌ను కలవాల్సిన అవసరం లేదన్నారు. రాహుల్ తప్పు చేయనప్పుడు కాంప్రమైజ్ అనే ప్రశ్న అనవసరం అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
ఫంక్షన్ కోసం మాత్రమే..
కాగా.. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లి కేవలం సినిమా షూటింగ్ పనిమీదే కలిశారన్నారు. మా మధ్య ఒక సినిమా ఫంక్షన్ మాత్రమే చర్చ జరిగిందన్నారు. రాహుల్ పబ్ గొడవకు తనకు ఎలాంటి సంబంధం లేదని వినయ భాస్కర్ స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com