కరోనా తర్వాత పారితోషికంపై ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..

  • IndiaGlitz, [Friday,April 24 2020]

కరోనా మమమ్మారి కాటేస్తున్న తరుణంలో సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు సర్వం బంద్ అయ్యాయి. దీంతో నిర్మాతలపై గట్టిగా దెబ్బ పడింది. బహుశా కరోనా ముందు.. కరోనా తర్వాత పరిస్థితులు సినీ ఇండస్ట్రీలో ఊహించుకోలేం. కరోనా తర్వాత పరిస్థితులు చాలా మారిపోతాయ్. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ ఉన్నంత రెమ్యునరేషన్లు ఉండకపోవచ్చు కూడా. అంతేకాదు.. ఒకవేళ నటీనటులు డిమాండ్ చేసినా నిర్మాతలు ఇచ్చుకోలేరేమో. ఇటీవల ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌ ఓ ప్రముఖ చానెల్‌కు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు, సినిమాల గురించి.. కరోనా తర్వాత పరిస్థితేంటి..? రెమ్యునరేషన్ విషయం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాన్నాయ్.. ఇలా పలు విషయాలను ఆయన పంచుకున్నారు.

కచ్చితంగా..!

పారితోషికం విషయమై పెద్ద పెద్ద స్టార్‌లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుందా..? అని ప్రకాష్ రాజ్‌ను అడగ్గా ఆయన చాలా లాజికల్‌గా బదులిచ్చారు. ‘అవసరముంటే కచ్చితంగా చేస్తాం.. ఎందుకు చేయం. అనవసరంగా ఎవరూ ఇవ్వరు కదా. ఎవరూ భారీ వేతనాలు తీసుకోవట్లేదు. వాళ్లు ఎంత తీసుకుంటున్నారో అంతే తీసుకుంటున్నారు. పరిస్థితుల దష్ట్యా.. మారిన సందర్భాల్లో ఎంత తీసుకుంటారో అంతే తీసుకుంటారు. ఎవరి అర్హతను బట్టి వాళ్లు పారితోషికం తీసుకుంటారు. పరిస్థితులు మారినప్పుడు ఎవరైనా సరే కచ్చితంగా ఏం చేయాలో అదే చేస్తారు. నిర్మాతలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఎవరూ డిమాండ్ చేయలేరు.. అదెలా తీసుకుంటాం’ అని ప్రకాష్ రాజ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

More News

నేను ఎంత వాడినో నాకే తెలియదు : ప్రకాష్ రాజ్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో లాక్ డౌన్ పొడిగించడంతో నిరుపేదలు, వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ వంతుగా

నేడు కేసీఆర్ పెళ్లి రోజు.. వెల్లువలా శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతుల పెళ్లిరోజు ఇవాళ. అంతేకాదు జోగునపల్లి రవీందర్ రావుది కూడా ఇవాళే పెళ్లిరోజు.

ఏపీలో కరోనా విజృంభణ.. అనూహ్యంగా పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందో తప్ప తగ్గట్లేదు. గడిచిన 24 గంటల్లో అనూహ్యంగా 80 పాజిటివ్ కేసులు

ఈ వీడియో ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలనుంది : ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశంపై అయినా సరే తనదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పించడంలో ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు.

'సాయిరెడ్డీ.. గొంతుకు కాదు.. ముక్కుకు మాస్క్ పెట్టుకోండి!'

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు