నేను ఎంత వాడినో నాకే తెలియదు : ప్రకాష్ రాజ్

  • IndiaGlitz, [Thursday,April 23 2020]

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న కాలంలో లాక్ డౌన్ పొడిగించడంతో నిరుపేదలు, వలస కార్మికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందజేస్తున్నారు. మరోవైపు కార్మికులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన సీసీసీకి కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం తన వంతుగా తన వంతుగా.. తిండి లేక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు అండగా నిలుస్తానని, తనకు ఎంత కష్టమొచ్చినా సేవ చేయడం ముందుంటానని ప్రకటించారు. అంతేకాదు.. తన ఆర్థిక వనరులు క్షీణిస్తున్నా సరే అప్పు తీసుకొని అయినా ఈ కష్టకాలంలో సాధ్యమైనంత సాయం అందిస్తానని.. భవిష్యత్‌లో మళ్లీ సంపాదించుకోగలనని తనకు తెలుసని ఇటీవలే ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఆయనకు ఇంట్లో.. ఫామ్‌లో, ట్రస్టులో పనిచేసే వారికి మే నెల వరకూ జీతాలు చెల్లించేశారు.

అది పద్ధతి కాదు..

తాజాగా.. ఓ ప్రముఖ తెలుగు ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇన్నాళ్లూ మనుషులుగా కృతకంగా బతకడంపైనే దృష్టి పెట్టామని.. అది మలన్ని ఎప్పటికీ కాపాడదని ప్రకాష్ పేర్కొన్నారు. కరోనాకు కారణం చైనా వాళ్లే అని మనం తిడుతున్నాం.. ఏదైనా సమస్య వస్తే ఇలా పక్కోడి తోసేస్తున్నాం అది పద్ధతి కాదన్నారు. ఇప్పుడు చేయాల్సింది అది కాదని.. కష్టకాలంలో మనకు ఉన్నదాన్ని అందరితో పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

నేను ఎంత వాడినో నాకే తెలియదు!

‘సినిమా అనేది నా జీవితంలో 5% శాతం మాత్రమే. కానీ నా జీవితంలో 95 శాతం వేరే అంశాలున్నాయి. నిరంతరం బతకడం, తీవ్రంగా బతకడం నాకు అలవాటు. ఉదయం 08:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా పొలం పనిచేస్తాను. భోజనం తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ పనిలోకి దిగుతాను. నేను ఎంతవాడినో నాకే తెలియదు. నా గురించి పక్కవాళ్లకే తెలుస్తుంది. వైరస్ కారణంగా నేను నా ఫామ్ హౌస్‌లో ఇరుక్కుపోయాను. అయినా నా టీమ్‌లు మాత్రం వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో ఉన్నాయి. మనం ఎంత సాయం చేస్తే.. అంత మనకు తిరిగి వస్తుంది. సేవా కార్యక్రమాల కోసం నా దగ్గర ఎప్పుడూ రిజర్వ్ ఫండ్ ఉంటుంది. నా ఫ్యామిలీకి కూడా సరిపడా డబ్బులు చూసుకుంటాను. సేవా కార్యక్రమాలకు నా దగ్గరుండే డబ్బులు అయిపోతే.. నాకు హీరోలో, నిర్మాతలో ఎవరో ఒకరు ఇస్తారు. కుటుంబం కోసం దాచి పెట్టాలనుకునే మూర్ఖుణ్ణి కాదు. అది వేరు.. ఇదివేరు. వెయ్యి మందికి అన్నం పెట్టగలిగే శక్తి నాకు ఉంది’ అని ప్రకాష్ చెప్పుకొచ్చారు.

More News

నేడు కేసీఆర్ పెళ్లి రోజు.. వెల్లువలా శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతుల పెళ్లిరోజు ఇవాళ. అంతేకాదు జోగునపల్లి రవీందర్ రావుది కూడా ఇవాళే పెళ్లిరోజు.

ఏపీలో కరోనా విజృంభణ.. అనూహ్యంగా పెరుగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందో తప్ప తగ్గట్లేదు. గడిచిన 24 గంటల్లో అనూహ్యంగా 80 పాజిటివ్ కేసులు

ఈ వీడియో ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలనుంది : ఆర్జీవీ

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంశంపై అయినా సరే తనదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పించడంలో ఆర్జీవీ ముందు వరుసలో ఉంటారు.

'సాయిరెడ్డీ.. గొంతుకు కాదు.. ముక్కుకు మాస్క్ పెట్టుకోండి!'

కరోనా మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయాలు ఆగట్లేదు. తమ వంతు సాయం చేసి పేదలను.. కరోనా బాధితులను ఆదుకోవాల్సిన నేతలు విమర్శలు

అర్నబ్‌ గోస్వామిపై దాడి వెనుక అసలేం జరిగింది.. ఎందుకిలా..!?

రిపబ్లికన్ టీవీ ఎడిటర్ అర్నబ్ గోస్వామిపై బుధవారం అర్థరాత్రి దాడి జరిగింది. ముంబైలోని టీవీ చానెల్ స్టూడియో నుంచి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు