చిరంజీవికి ఆ పెద్దరికం ఉంది: ప్రకాశ్‌రాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఉత్తర, దక్షిణాది చిత్రాల్లో విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రకాశ్‌రాజ్. కరోనా వల్ల లాక్‌డౌన్‌ను విధించినప్పుడు చాలా మంది పేదలకు ఆహారాన్ని అందించడంతో పాటు.. వలస కూలీలకు తన వంతు సాయాన్ని అందించి తన పెద్ద మనసును చాటుకున్నారు ప్రకాశ్ రాజ్. పలు విషయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రజలపై కరోనా సమయంలో వ్యవహరించిన తీరుపై తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్య మధ్య జరిగిన గొడవ వ్యవహారం గురించి ప్రశ్నించారు.
దీనిపై ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ‘‘నాకు బాలకృష్ణగారు తెలుసు, అలాగే చిరంజీవి అన్నయ్య గురించీ తెలుసు. ఎవరినైనా పిలిచి సినీ ఇండస్ట్రీ గురించి చర్చించే అవకాశం చిరంజీవికి ఉంది. నన్ను పిలవలేదని నేను అనుకోకూడదు. అలాగే బాలకృష్ణగారిని మరో కార్యక్రమానికి పిలుస్తారేమో. బాలయ్యకు నేను చెప్పేటంతటి వాడిని కాను. కానీ నాకు ఎలాంటి ఇగో సమస్యలు లేవు. ఇలాంటి విషయాలపై వివాదాలు చేయకూడదు’’ అన్నారు.
రీసెంట్‌గా ప్రభుత్వంలో సినీ పెద్దలు చర్చలు జరిపారు. ఆ సమయంలో తనను పిలవకపోవడంపై బాలకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తర్వాత బాలకృష్ణకు నాగబాబు కౌంటర్ ఇవ్వడం.. ఇలా వ్యవహారం పెద్దదిగా మారింది. రీసెంట్ ఇంటర్వ్యూలో నాగబాబు వ్యాఖ్యలపై తానేం మాట్లాడనని బాలకృష్ణ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com