అమితాబ్ ఇంట్లో ప్రకాష్ రాజ్..

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

అమితాబ్ బ‌చ్చ‌న్ ని ప్ర‌కాష్ రాజ్ ఇంటికి వెళ్లి క‌లిసారు. ఈ విష‌యాన్ని ప్ర‌కాష్ రాజ్ స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేసారు. లెజెండ్ అమితాబ్ ని త‌న ఇంట్లో క‌లిసాను. అమితాబ్ తో మ‌ర‌చిపోలేని మీటింగ్ ఇది. బిగ్ బి చూపించిన ప్రేమ‌తో చాలా సంతోషంగా ఉన్నాను అంటూ అమితాబ్ తో తీసుకున్న ఫోటోను పోస్ట్ చేసారు ప్ర‌కాష్ రాజు. అయితే.. అమితాబ్ ని ఎందుకు క‌లిసారనే విష‌యం మాత్రం చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న‌ చిత్రం మ‌న ఊరి రామాయ‌ణం. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో తెర‌కెక్కుతున్న మ‌న ఊరి రామాయ‌ణం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

ఆ జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయంటున్న శ్రియ‌

అందం, అభిన‌యం ఈ రెండూ ఉన్న‌ అతి కొద్ది మంది తార‌ల్లో అందాల తార శ్రియ ఒక‌రు. ఇటీవ‌ల శ్రియ నాగార్జున ఊపిరి చిత్రంలో క‌నిపించి అల‌రించిన విష‌యం తెలిసిందే.

జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్ డీటైల్స్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది.

ర‌జ‌నీ రాక‌తో వెన‌క్కి వెళ్లిన వెంకీ..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. రంజిత్ తెర‌కెక్కించిన‌  సంచ‌ల‌న చిత్రం క‌బాలి ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

ఎన్టీఆర్ టైటిల్ ఆ హీరోకి క‌లిసొచ్చేనా..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం టెంప‌ర్. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. అస‌లు ఈ చిత్రానికి నేనొర‌కం అనే టైటిల్ పెట్టాల‌న‌కున్నారు. కానీ..ఎందుక‌నో టెంప‌ర్ అని పెట్టారు.

నాని మూవీలో విల‌న్ గా నటిస్తున్న యంగ్ హీరో..

భ‌లే భ‌లే మ‌గాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌, జెంటిల్ మ‌న్...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో నాని. తాజాగా సినిమా చూపిస్త మావ డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టిస్తున్నాడు.