స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. తిరిగి షూటింగ్‌కి వచ్చేశా: ప్రకాష్ రాజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చాలా కాలం తర్వాత షూటింగ్‌లో పాల్గొన్నారు. ఐదు నెలల కాలంగా సినీ పరిశ్రమ స్తంభించి పోయింది. కరోనా కారణంగా మార్చిలో అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన చిత్ర పరిశ్రమలూ షూటింగ్‌లను నిలిపి వేశాయి. కొన్ని రాష్ట్రాల్లో ఆయా స్థానిక ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినప్పటికీ సినిమాలు మాత్రం పెద్దగా షూటింగ్‌లు జరుపుకున్నది లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో చిత్ర బృందాలు క్రమక్రమంగా షూటింగ్‌లను ప్రారంభించుకుంటున్నాయి.
తాజాగా తన సినిమా షూటింగ్‌కు సంబంధించిన పిక్స్‌ను ప్రకాష్ రాజ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. తిరిగి షూటింగ్‌కి వచ్చేశా’ అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వచ్చేసి బెంగుళూరులో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ ‘కేజీఎఫ్ 2’కి సంబంధించిందేనని అభిమానులు సంబరపడుతున్నారు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిన ‘కేజీఎఫ్’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇటీవలే కేజీఎఫ్ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమా పార్ట్ 1లో కన్నడ ప్రముఖ నటుడు అనంత్ నాగ్ నటించిన విషయం తెలిసిందే. ఆయన పాత్రను పార్ట్ 2లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారని తెలుస్తోంది. అయితే కొన్ని నెలల క్రితం ‘కేజీఎఫ్ 2’ నుంచి అనంతనాగ్ తప్పుకున్నారని వార్తలొచ్చాయి. అనంత్ నాగ్ పోషించిన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని మార్పులు చేర్పులు చేశారని సమాచారం. ఇది నచ్చకపోవడంతో అనంత్ నాగ్ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ పాత్రను ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com