కోర్టు సమస్యల్లో ప్రకాశ్‌రాజ్
- IndiaGlitz, [Sunday,August 25 2019]
హిందీ సహా దక్షిణాది భాషల్లో పలు వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదిచుకున్నాడు ప్రకాశ్‌రాజ్. తెలుగు, తమిళంలో దర్శకుడిగా ఉలవచారు బిర్యానీ అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమా గొప్ప విజయాన్ని సాధించకపోయినా.. దర్శకుడిగా ప్రకాశ్‌రాజ్‌కి విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి.
అలాగే తన దర్శకత్వంలో ‘మన ఊరి రామాయణం’ సినిమాను కూడా డైరెక్ట్ చేశారు ప్రకాశ్‌రాజ్. ఈ సినిమా తర్వాత ఉలవచారు బిర్యానీతో దర్శకుడితో బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. 2016లో ఈ రీమేక్‌కి ‘తడ్కా’ అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఆర్దిక సమస్యలు కారణంగా ఈ రీమేక్ ఆగిపోయింది. ప్రకాశ్ రాజ్ నిర్మాణంలో భాగస్వామ్యులైన జీ గ్రూపోవర్, ఎసెల్ విజన్ సంస్థలు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు చేశాయి. జూలై 15 నాటికి ప్రకాశ్‌రాజ్ చెల్లించాల్సిన రూ.5.88కోట్లను చెల్లించలేదని పిటిషన్ వేశాయి. అయితే పరిస్థితిని చేయి దాటిపోయి, అరెస్టులు గట్రా కాకుండా ప్రకాశ్‌రాజ్ జాగ్రత్త పడ్డాడు. పార్ట్నర్స్కు రెండు కోట్ల రూపాయల చెక్‌తో పాటు తన ఆస్థి పత్రాలను కూడా ఇచ్చాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరికి మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తానని లేకుంటే ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవాలని సూచించాడు. దీంతో జీ గ్రూపోవర్, ఎసెల్ విజన్ సంస్థలు ప్రకాశ్‌రాజ్‌కి సమయాన్ని కేటాయించాయి. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే దీనికి మరో కేసు కూడా తోడవుతుంది.
రాజకీయాల వైపు మొగ్గు
జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. క్రమంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రకాశ్‌రాజ్ సెంట్రల్ బెంగళూరు నుండి ఇండిపెండెంట్ పార్లమెంట్ మెంబర్‌గా పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయాడు ప్రకాశ్‌రాజ్. ఎన్నికలు తర్వాత మళ్లీ సినిమాల వైపు మొగ్గు చూపారు. ఆయన కారణంగానే జగపతిబాబుని సరిలేరు నీకెవ్వరు నుండి రీప్లేస్ చేశారనే ఉహగానాలు కూడా వినపడుతున్నాయి. సాధారణంగా ప్రకాశ్‌రాజ్ చేతిలో రెండు, మూడు ప్రాజెక్టులుంటాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఈ ఏడాది మహేశ్ ‘సరిలేరునీకెవ్వరు’ సినిమా మాత్రమే ఉంది.