ప్రకాష్ రాజ్ పిలిచిన వేళ..
Send us your feedback to audioarticles@vaarta.com
సంపాదించినదానిలో కొంతభాగాన్ని సమాజ సేవ కోసం ప్రకాష్ రాజ్ కేటాయిస్తున్నారు. ఇలా తమ సంపాదనలో కొంత భాగాన్నైనా తిరిగి ఇవ్వాలనుకునేవారు ఆయనతో చేతులు కలపవచ్చు. దానికోసం ఆయన ఓ వెబ్ సైటును కూడా రూపొందించారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే కర్ణాటకలోని బంధిపుర అడవిని, తెలంగాణ మహబూబ్ నగర్ లోని కొండరెడ్డిపల్లెను దత్తత తీసుకున్నారు.
దీని గురించి ఆయన వెబ్ సైటులో రాసుకున్నారు.. నేను ఇవాళ ఉన్న స్థాయి, స్థానం మీరిచ్చినవే. ఇప్పుడు నేను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రకృతి కోసం, కళ కోసం, లేనివారి కోసం నా వంతు సాయం చేయాలని ఈ నా గమనం, నా ఆలోచనల వల్ల అర్థం చేసుకున్నాను. అరణ్యాలను రక్షించడం, గ్రామాలను దత్తత తీసుకోవడం, పేద కళాకారులకు సాయం చేయడంతో పాటు ఇంకా ఎన్నెన్నో విషయాలు మన ముందున్నాయని తెలుసు. నా సంపాదనలో కొంత పక్కనపెట్టి వీటి కోసం ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కలసి పయనించాలనుకునేవారు చేతులు కలపండి. నేను దీన్ని సంతోషంగా చేస్తున్నాను. పంచుకోవడంలో ఆనందం ఉంది`` అని రాసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com