ప్రకాష్ రాజ్ పిలిచిన వేళ..

  • IndiaGlitz, [Wednesday,September 16 2015]

సంపాదించినదానిలో కొంతభాగాన్ని సమాజ సేవ కోసం ప్రకాష్ రాజ్ కేటాయిస్తున్నారు. ఇలా తమ సంపాదనలో కొంత భాగాన్నైనా తిరిగి ఇవ్వాలనుకునేవారు ఆయనతో చేతులు కలపవచ్చు. దానికోసం ఆయన ఓ వెబ్ సైటును కూడా రూపొందించారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే కర్ణాటకలోని బంధిపుర అడవిని, తెలంగాణ మహబూబ్ నగర్ లోని కొండరెడ్డిపల్లెను దత్తత తీసుకున్నారు.

దీని గురించి ఆయన వెబ్ సైటులో రాసుకున్నారు.. నేను ఇవాళ ఉన్న స్థాయి, స్థానం మీరిచ్చినవే. ఇప్పుడు నేను తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రకృతి కోసం, కళ కోసం, లేనివారి కోసం నా వంతు సాయం చేయాలని ఈ నా గమనం, నా ఆలోచనల వల్ల అర్థం చేసుకున్నాను. అరణ్యాలను రక్షించడం, గ్రామాలను దత్తత తీసుకోవడం, పేద కళాకారులకు సాయం చేయడంతో పాటు ఇంకా ఎన్నెన్నో విషయాలు మన ముందున్నాయని తెలుసు. నా సంపాదనలో కొంత పక్కనపెట్టి వీటి కోసం ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కలసి పయనించాలనుకునేవారు చేతులు కలపండి. నేను దీన్ని సంతోషంగా చేస్తున్నాను. పంచుకోవడంలో ఆనందం ఉంది'' అని రాసుకున్నారు.

More News

పులికి క్లీన్ యు

విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా పులి. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. దేవిశ్రీ అందించిన సంగీతం ఈ నెల 19న విడుదల కానుంది.

ముగ్గుల పండక్కి డిక్టేటర్

బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్న సినిమా డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

జయనన్ ఎందుకెళ్ళారు?

సర్దార్ గురించి చిన్న విషయం బయటికి వచ్చినా అది టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది. గబ్బర్ సింగ్ అయిన హిట్ అలాంటిది మరి.

నాగ్ లేటెస్ట్ సెంటిమెంట్ ఏమిటి..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున సెంటిమెంట్ ఏమిటి అని అడిగితే ఠ‌క్కున డిసెంబ‌ర్ నెల అని చెబుతారు. మాస్, మ‌న్మ‌ధుడు, డాన్, కింగ్...ఇలా నాగ్ కి స‌క్సెస్ ని అందించిన చిత్రాల‌న్నీ డిసెంబ‌ర్లో రిలీజ్ అయిన‌వే.

సన్నీ కండోమ్ గోల

బాలీవుడ్ హాట్టీ సన్నిలియోన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఈ పోర్న్ స్టార్ ఏకంగా కండోమ్ కి సంబంధించిన గొడవలో ఇరుక్కుంది.