ప్రకాశ్ రాజ్ డిజిటల్ ఎంట్రీ!!

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

సిల్వ‌ర్ స్క్రీన్స్ అన్నీ క‌రోనా దెబ్బ‌కు మూత ప‌డ్డాయి. ఇప్ప‌ట్లో థియేట‌ర్స్ ఓపెన్ అయ్యేలా లేవు. థియేట‌ర్స్ ఓపెన్ కావ‌డం, వాటికి ప్రేక్ష‌కులు భ‌యం లేకుండా రావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంద‌ని నిర్మాత‌లు కూడా ఒప్పుకుంటున్నారు. దీంతో చిన్న‌, ఓ మోస్త‌రు సినిమా నిర్మాత‌లు త‌మ ప్రొడ‌క్ట్‌ను ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. క్ర‌మంగా ఓటీటీకి ప్రాధాన్య‌త పెరుగుతుంది. ఈ క్ర‌మంలో బాలీవుడ్‌, సౌత్ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులంద‌రూ డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ డిజిట‌ల్ బాట‌లోకి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ కూడా అడుగుపెట్టేశార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ గురించి ఇటు సౌత్‌, అటు నార్త్ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచయం అక్క‌ర్లేదు.

వివ‌రాల మేర‌కు ప్ర‌కాశ్‌రాజ్ టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల్లో ప్ర‌ముఖ‌మైన ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం జరిగిన కొన్ని నిజ ఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నార‌ట‌. ఈ వెబ్ సిరీస్‌లో న‌టించ‌డ‌మే కాదు. క‌థా రూప‌క‌ల్ప‌న‌లోనూ ప్ర‌కాశ్‌రాజ్ పార్ట్ అయ్యార‌ట‌. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంది.

More News

ట్రోల‌ర్స్‌కు త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌

ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియా ఎక్కువ‌గా భావ ప్ర‌క‌ట‌న‌ల వేదిక‌గా మారింది. అయితే ఇదే వేదిక సెల‌బ్రిటీల‌కు ఇబ్బందిగా మారింది.

అధికారులంతా కోర్టుకు హాజరవ్వాల్సిందే: కరోనా టెస్టులపై తెలంగాణ హైకోర్టు ఫైర్

కరోనా పరీక్షల నిర్వహణ నుంచి మొదలుకొని ఎన్ని కిట్లిచ్చారు? ఎందుకు టెస్టులు నిలిపివేశారు? తదితర విషయాల్నింటిపై తెలంగాణ హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది.

నితిన్ పెళ్లి తేది, వేదిక ఖ‌రారు !

నితిన్ ఇంత వ‌ర‌కు త‌న పెళ్లి డేట్‌ను ఖ‌రారైంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జూలై 26న హైద‌రాబాద్ ఫ‌ల‌క్‌నామా ఫ్యాలెస్‌లో నితిన్‌, షాలినిల పెళ్లి జ‌ర‌గ‌నుంది.

నటి పూర్ణ కేసు విచారణలో మరో కొత్త విషయం వెలుగులోకి..

నటి పూర్ణ(షామ్నా ఖాసిం) కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. పూర్ణను బెదిరించిన ముఠాతో మలయాళ నటుడు ధర్మజన్‌ బోల్‌గట్టికి సంబంధాలు ఉన్నట్టుగా

హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షల కోసం సంప్రదించాల్సిన కేంద్రాలివే..

హైదరాబాద్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.