ప్రకాశ్ రాజ్ డిజిటల్ ఎంట్రీ!!
Send us your feedback to audioarticles@vaarta.com
సిల్వర్ స్క్రీన్స్ అన్నీ కరోనా దెబ్బకు మూత పడ్డాయి. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేవు. థియేటర్స్ ఓపెన్ కావడం, వాటికి ప్రేక్షకులు భయం లేకుండా రావడానికి సమయం పడుతుందని నిర్మాతలు కూడా ఒప్పుకుంటున్నారు. దీంతో చిన్న, ఓ మోస్తరు సినిమా నిర్మాతలు తమ ప్రొడక్ట్‌ను ఓటీటీలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. క్రమంగా ఓటీటీకి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్, సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ డిజిటల్ బాటలోకి విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా అడుగుపెట్టేశారని సినీ వర్గాల సమాచారం. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ గురించి ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.
వివరాల మేరకు ప్రకాశ్‌రాజ్ టాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో ప్రముఖమైన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన కొన్ని నిజ ఘటనలను బేస్ చేసుకుని ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నటించడమే కాదు. కథా రూపకల్పనలోనూ ప్రకాశ్‌రాజ్ పార్ట్ అయ్యారట. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com