కంగనాకు కౌంటరిచ్చిన ప్రకాశ్‌రాజ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్ మాఫియా సంబంధాలున్నాయని ఆధారాలు దొరకడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. విచారణలో భాగంగా రియా చక్రవర్తిని నార్కోటిక్ విభాగం అరెస్ట్ చేసింది. ఇవన్నీ ఓ వైపు నడుస్తుంటే మరో వైపు కంగనా రనౌత్ ఈ వ్యవహారంలో ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే గొడవ పెట్టుకుంది. ఇక ప్రభుత్వం ఊరుకుంటుందా? కంగనా ఆఫీసు అక్రమకట్టడం అంటూ కూల్చేసింది. అయినా కూడా కంగనా రనౌత్ వెనక్కి తగ్గలేదు. ఏకంగా సోనియా గాంధీ, ఉద్దవ్ థాక్రేలను టార్గెట్ చేసుకుని ట్వీట్స్ చేయడం ప్రారంభించింది. కంగనాకు వై ప్లస్ భద్రతను కేంద్రం ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా వ్యవహరిస్తోన్న తీరు కొందరికీ నచ్చడం లేదు. దాంతో వారు కంగనా వ్యవహార శైలిని బాహాటంగా విమర్శిస్తున్నారు.
తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్ వేదికగా కంగనా రనౌత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక సినిమాలో నటించినందుకే కంగనా తనను తాను రాణీ లక్ష్మీబాయ్ అనుకుంటే అశోకలో నటించిన షారూక్, జోథా అక్బర్‌లో నటించిన హృతిక్, పద్మావత్‌లో నటించిన దీపికాపదుకొనే, మంగళ్‌పాండేలో నటించిన ఆమిర్‌ఖాన్, భగత్ సింగ్‌గా నటించిన అజయ్ దేవగణ్ ఏమని ఆలోచించాలి? అంటూ తనదైన శైలిలో జస్ట్ ఆస్కింగ్ అంటూ కంగనా రనౌత్‌కు కౌంటర్ విసిరారు ప్రకాశ్‌రాజ్. మరి కంగనా, ప్రకాశ్ రాజ్‌కు రీ కౌంటర్ ఇస్తారా? లేక లేదా? అని చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments