స్టార్ ప్రొడ్యూసర్‌గా ప్రకాశ్ రాజ్....
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పాత్రల ఎంపికలో పరిమితంగా ఉంటున్నాడనే సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాసకల్యాణం, హలో గురూ ప్రేమ కోసమే చిత్రాల్లో నటిస్తున్న ప్రకాశ్ రాజ్.. 'మహానటి' చిత్రంలో చక్రపాణి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విలక్షణ నటుడు దివంగత ఎన్టీఆర్ బయోపిక్ 'యన్.టి.ఆర్'లో ప్రముఖ నిర్మాత పాత్రలో నటించనున్నాడట.
వివరాల్లోకెళ్తే.. ఎన్టీఆర్‌తో 'షావుకారు', 'పాతాళ భైరవి', 'మిస్సమ్మ', 'మాయాబజార్', 'గుండమ్మకథ' లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన విజయా వాహిని స్టూడియోస్ అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ బి.నాగిరెడ్డి పాత్రలో నటించనున్నాడట. ఈ విషయాన్ని ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com