Sunitha Krishnan:ఉపాసన ఇంత మందికి సాయం చేశారా.. ఎవ్వరికి తెలియని విషయాలు చెప్పిన సునీతా కృష్ణన్

  • IndiaGlitz, [Thursday,June 22 2023]

ఉపాసన కొణిదెల.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి. అటు పుట్టింటి తరపున చూస్తే అపోలో ఆసుపత్రి ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలు. రెండు కుటుంబాలకు దేశ, విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వున్నాయి. పుట్టింటిని , మెట్టింటిని సమానంగా చూసుకుంటూ ఇరు కుటుంబాల గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా నడుచుకుంటున్నారు ఉపాసన.

సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే ఉపాసన :

ఇక భర్త సినిమాలతో బిజీగా వుంటుంటే.. కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాలను ఉపాసన పర్యవేక్షిస్తున్నారు. తద్వారా చరణ్‌కు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా వుంటున్నారు. తొలి నుంచి సామాజిక సేవలో ముందుండే ఉపాసన పెళ్లయిన తర్వాత కూడా అదే స్థాయిలో తన సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఎన్నో వందల జంతువులను కూడా ఉపాసన సంరక్షిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ ద్వారా కరోనా మహమ్మారి సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆమె, మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సైతం వైద్యం అందేలా కృషి చేశారు. పర్యావరణం, వైల్డ్ లైఫ్ వంటి విషయాల్లోనూ ఉపాసన ముందుంటారు. తాజాగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న వృద్ధాశ్రమాలకు అండగా నిలబడేందుకు ఆమె ముందుకొచ్చారు. అక్కడ తలదాచుకుంటున్న వృద్ధులకు మందులు, ఆహార పదార్థాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉపాసన జీవితంలో ప్రజ్వల ఓ భాగం :

ప్రజ్వల ఫౌండేషన్‌కు ఉపాసన గట్టి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇటీవల ఉపాసనకు ఊయల పంపింది ఈ సంస్థే. ఈ నేపథ్యంలో ప్రజ్వల ఫౌండేషన్ గురించి నెటిజన్లు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉపాసన మానవత్వం , మంచి మనసు గురించి ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ ‘‘ https://indiaglitz.com/’’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా ఉపాసన తమ సంస్థకు అండగా నిలుస్తున్నారని.. మిగిలిన దాతలు ఇష్టమొచ్చినట్లుగా సపోర్ట్ చేస్తారని, కానీ ఉపాసన మాత్రం మాకు ఏం కావాలో తెలుసుకుని సహాయం చేస్తారని సునీత అన్నారు. ఇక్కడున్న మహిళల ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఉపాసన.. 24 గంటలూ అందుబాటులో వుండేలా డాక్టర్, వైద్య సిబ్బంది, ఫార్మసీని సమకూర్చారని తెలిపారు. కరోనా సమయంలో క్వారంటైన్ సెంటర్ పెట్టి ఆదుకున్నారని ప్రశంసించింది. ఆమె జీవితంలో ఏం జరిగినా ఖచ్చితంగా ప్రజ్వలకు భాగం వుంటుందని.. ఆమె సిస్టర్ మ్యారేజ్‌కు సంబంధించిన ఈవెంట్ కూడా ఇక్కడ నిర్వహించిందని సునీత చెప్పారు. ఇంత చేసినా ఎక్కడా పబ్లిసిటీ చేసుకోకపోవడం ఉపాసన పెద్ద మనసుకు నిదర్శనమన్నారు.

ఊయల చూడగానే ఉపాసన రియాక్షన్ ఇదే :

మా కోసం ఇంత చేసిన ఆమెకు ఊయల ఇవ్వాలని అనుకున్నామని.. కానీ ఉపాసనకు ఇవ్వగల అర్హత మాకుందా అని ప్రశ్నించుకున్నామని సునీత చెప్పారు. ఆమె తలచుకుంటే విలువైన వస్తువులు క్షణాల్లో సమకూరుతాయని అనుకుని .. పిల్లలతో ఊయల వద్దని చెప్పానని, కానీ వారు మాత్రం ఒకసారి ఆమెను అడిగితే పోతుంది కదా అని సలహా ఇచ్చారని సునీతా కృష్ణన్ అన్నారు. దీని గురించి ఉపాసనకు మెసేజ్ పెడితే.. ఆమె వెంటనే ఓకే చెప్పారని గుర్తుచేశారు. పిల్లలు 12 రోజులు ఎంతో కష్టపడి చేతితోనే ఊయల తయారు చేశారని సునీత తెలిపారు. అది ఇవ్వడానికి వెళ్లినరోజు ఉపాసన ఎంతో సంబరపడ్డారని, నిజంగా ఆమె తల్లిదండ్రులు ఎంతో ధన్యులని సునీత ప్రశంసించారు.

More News

Janasena :వైసీపీ ఉప్మా పార్టీ , పిట్టకథ చెప్పి.. జగన్‌ పాలన ఎలాంటిదో చెప్పిన పవన్ కల్యాణ్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌, వైసీపీ నేతలపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Janasena President:ఎకరాకొక బియ్యం బస్తా ద్వారంపూడి ఇంటికే.. ఏపీని వైసీపీ తెల్ల దోమ తెగులులా పీడిస్తోంది : పవన్ కల్యాణ్

రైతు సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ ఆశ చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాన్ని నెరవేర్చలేకపోయారని

Pawan Kalyan:ప్రభాస్ , మహేష్ నా కంటే పెద్ద హీరోలు.. నాకేం ఇగో లేదు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్, మహేష్ తనకంటే పెద్ద హీరోలని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి విజయ యాత్రలో

KA Paul:కేఏ పాల్ సంచలన నిర్ణయం.. ప్రజాశాంతి పార్టీ నుంచి గద్ధర్ బహిష్కరణ

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా గాయకుడు గద్దర్‌ను ఆయన పార్టీ పార్టీ నుంచి బహిష్కరించారు

Mudragada:ముద్రగడకు కాలింది : ఎంతమంది తొక్క తీశారు.. ఎంతమందికి గుండు గీయించారు , చెప్పండి పవన్

ముద్రగడ పద్మనాభం.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉద్యమ నేతగా ఆయనకు అపార అనుభవం వుంది.