KA Paul - Roja : పందిలా తిని పిచ్చి కుక్కలా అరుస్తుంది : రోజాపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. శనివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు యథాతథంగా.. ‘‘జగన్మోహన్ రెడ్డి గారు.. మీరు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత ఫెయిల్ అయ్యారో మీకు తెలుసు. మీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు తెలుసు. మూడున్నర సంవత్సరాలుగా మోడీ గారికి పాదపూజ చేస్తూ, మసాజులు చేస్తూ అడుక్కునేటట్లు అయ్యా... అయ్యా అని ఆయన పాదాలు పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్‌కి స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు తేలేకపోయారు. చివరికి లక్షల కోట్లు అప్పు చేసి మీరు మాట్లాడలేకుండా , సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి మీ మంత్రులతో పిచ్చికుక్కల్లా మాట్లాడిస్తున్నారు.
ఆ కొడాలి నాని గాడెవడో నాకు తెలియదు:
రోజా అంట.. ఓ పందిలాగా తింటుందేమో . పిచ్చికుక్క కరిస్తే ఏట్లా మాట్లాడుతుందో బండి సంజయ్‌లా మాట్లాడుతోంది. నా పేరు ఎందుకు తీసుకురావడం. లాస్ట్ వీక్ ఆ కొడాలి నాని గాడంట. ఆడేవడో నాకు తెలియదు. నా పేరు ఎందుకు తీసుకురావడం. మీకు కనీసం బుద్ది వుందా ..? మీకు తెలుసు కదా .. 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. లక్షల కోట్లు తీసుకొచ్చి దానం చేశాననే కదా మీ నాన్న గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు, అయిన తర్వాత కూడా 20 , 30 సంవత్సరాలుగా నా పాదాల దగ్గర కూర్చొన్నారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలతో నన్నెందుకు టచ్ చేస్తారు. మీకు చేతకాలేదు.. మీకు పని చేయడం రాదు. ఆ రోజా అన్న ఆవిడకు మీరు మంత్రి ఇచ్చారంటే అంతకన్నా మంచోళ్లు మీకు దొరకలేదా. లేదా ఆ పిచ్చికుక్కలాగా వాగుతాడు ఆ కొడాలి నానికి ఎందుకు మీరు జాబ్స్ ఇచ్చారు.
మళ్లీ వీళ్లకే ఛాన్స్ ఇస్తే ఇండియా మరో శ్రీలంకే:
మీకు ఏ పని చేతకానప్పుడు నేను చేసి చూపిస్తానని అన్నాను. తెలుగు రాష్ట్రం విడిపోయి ఎనిమిదన్నర సంవత్సరాలు. క్యాపిటల్ కట్టారా, అభివృద్ది జరిగిందా, లక్షల కోట్లు అప్పు అయిపోయిందా లేదా. తెలంగాణని కేసీఆర్ అమ్మేశాడు.. ఆంధ్రప్రదేశ్‌లో వీళ్లు ఫెయిల్ అయిపోయారు. కనుక ఇప్పటికైనా బుద్ధున్న ఎవరైనా , తెలివి తేటలున్న ఎవరైనా , మూర్ఖులు కాని ఎవరైనా, చదువుకున్న వారు ఎవరైనా , అప్పుల నుంచి విడుదల చెంది అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న పార్టీలను విడిచిపెట్టి ప్రజాశాంతి పార్టీలో చేరండి . లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా ఏవిధంగా అయిపోయిందో మీకు తెలుసు. ఇలాంటి వారికి మరలా మీరు అవకాశం ఇస్తే... ఇప్పుడు శ్రీలంక, జింబాబ్వేల మాదిరిగా మన రాష్ట్రాలు , దేశం నాశనం కావడం ఖాయం. కనుక మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి.
మన రాష్ట్రాలను అభివృద్ధి చేద్దామని నేనొచ్చా:
వీళ్లేం చేస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ.. అభివృద్ధి చేస్తున్న నన్ను , నా పేరెందుకు తీసుకురావడం. 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను, 7 యుద్ధాలు ఆపాను, 200 కోట్లకు పైగా ఫాలోవర్స్ వున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన ఇండియాను బాగు చేద్దామని, తెలుగు రాష్ట్రాలను రక్షించాలని నేను రాజకీయాల్లోకి వస్తే. వందలు , వేల కోట్లు దోచుకుని పందుల్లాగా, పశువుల్లాగా అమ్ముడుపోతూ ఎమ్మెల్యేలు, మంత్రులు .. పనికిమాలిన పనులు చేస్తున్నోళ్లకి ఈ ముఖ్యమంత్రులకి, మంత్రులకి పదవులా. తిండి , బట్ట లేకుండా తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది, ఇతర రాష్ట్రాల్లో కోట్ల మంది బాధ పడుతుంటే చూసి భరించలేక, సహించలేక బాధతో వేదనతో ఏ విధంగా మన రాష్ట్రాలను మనం అభివృద్ధి చేయగలమనే మంచి ప్లాన్‌తో నేనొస్తే .. నా ఫ్యాన్స్ అంతా ఈ వీడియోని వైరల్ చేయాలని కోరుకుంటున్నానని కేఏ పాల్ ముగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com