మంచు హీరోతో ఆమె చేయడం లేదు....

  • IndiaGlitz, [Monday,July 25 2016]

'కంచె'తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో సీతాదేవిగా చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్న ప్ర‌గ్యాజైశ్వాల్‌కు ఆమె న‌ట‌న‌కు మంచి ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇప్పుడు నాగార్జున‌, రాఘ‌వేంద్రరావు కాంబినేష‌న్‌లో రానున్న'ఓం న‌మో వెంక‌టేశాయ' చిత్రంలో న‌టిస్తుంది. ఇది కాకుండా రీసెంట్‌గా మంచు మ‌నోజ్ హీరోగా రూపొంద‌నున్న ఓ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌లో హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే కార‌ణాలు తెలియ‌డం లేదు కానీ ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైశ్వాల్ న‌టించ‌డం లేద‌ట‌. చిత్ర‌యూనిట్ మ‌రో హీరోయిన్ అన్వేష‌ణ‌లో ఉంది. గ‌తంలో నా రాకుమారుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన టి.స‌త్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడ‌ట‌.

More News

అవసరాలతో రెజీనా..?

నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ ఇప్పుడు ఓ బాలీవుడ్ చిత్రంలో నటించనున్నాడు. `హంటర్` అనే బాలీవుడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం తెరకెక్కిస్తారని అంటున్నారు.

కన్నడ రీమేక్ లో ఆది...

ఆగస్ట్ 5న `చుట్టాలబ్బాయి`గా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి హీరో ఆది, తండ్రితో సాయికుమార్తో కలిసి రెడీ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత హీరో ఆది తన తదుపరి చిత్రంగా కన్నడ ఘన విజయం సాధించిన `ఫస్ట్ ర్యాంక్ రాజ్` చిత్రాన్ని రీమేక్ లో నటించనున్నాడట.

వెంకటేష్ ను బాబు...బంగారం అని ఇప్పుడు అంటున్నారు కానీ...నేను ఆరోజే చెప్పాను - దర్శకరత్న దాసరి

విక్టరీ వెంకటేష్-యువ దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాబు బంగారం.ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అందాలతార నయనతార నటించింది.

హరితహారం లో పాల్గొన్న మజ్ను చిత్ర బృందం

పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం లో మజ్ను చిత్ర బృందం పాల్గొన్నారు.

ఆగస్ట్ 5 న 'మరల తెలుపనా ప్రియా' విడుదల

ప్రిన్స్,వ్యోమనంది,పూజా రామచంద్రన్ లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం'మరల తెలుపనా ప్రియా'.ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదలకు సిద్ధమైంది.