మనోజ్ తో ప్రగ్యాజైశ్వాల్....
Send us your feedback to audioarticles@vaarta.com
కంచెతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సీతాదేవిగా చెరగని ముద్రవేసుకున్న ప్రగ్యాజైశ్వాల్‌కు ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రానున్నఓం నమో వెంకటేశాయ చిత్రంలో నటిస్తుంది. ఇది కాకుండా రీసెంట్‌గా మంచు మనోజ్ హీరోగా రూపొందనున్న ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌లో హీరోయిన్‌గా నటించనుందట. గతంలో నా రాకుమారుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన టి.సత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడట. రీసెంట్‌గా ఈ చిత్ర కథను విన్న ప్రగ్యాకు తన పాత్ర డిజైన్ చేసిన తీరు నచ్చడంతో సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అంటున్నారు. త్వరలోనే అధికారక సమాచారం రావాల్సి ఉంది..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com