రొమాంటిక్ కింగ్ తో బ్యూటీ క్వీన్ ప్రగ్యా..!

  • IndiaGlitz, [Thursday,December 08 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వేంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని శిరిడి సాయి చిత్ర నిర్మాత మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. హ‌ధీరామ్ బాబా జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. రొమాంటిక్ కింగ్ నాగార్జున‌...రొమాన్స్ లో పిహెచ్డీ చేసిన ప్రిన్సిపాల్ ద‌ర్శ‌కేంద్రుడు క‌లిసి సినిమా చేస్తే...ఆ సినిమాలో రొమాన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. భ‌క్తిర‌స చిత్రంగా రూపొందుతున్న‌ ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి.
అస‌లు చెప్పాలంటే....ర‌క్తి త‌ర్వాతే భ‌క్తి. అందుక‌నే ద‌ర్శ‌కేంద్రుడు ఈ భ‌క్తిర‌స చిత్రంలో హ‌థీరామ్ బాబా రొమాంటిక్ యాంగిల్ కూడా చూపిస్తున్నారు. నాగార్జున‌, ప్రగ్యా జైస్వాల్ పై ఇటీవ‌ల ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీక‌రించారు. ఈ రొమాంటిక్ సాంగ్ కి సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసారు. ఫ‌స్ట్ టైమ్ జంట‌గా న‌టిస్తున్న నాగార్జున‌, ప్ర‌గ్యా జైస్వాల్ రొమాంటిక్ స్టిల్స్ చూస్తుంటే అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని ఓం న‌మో వేంక‌టేశాయ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం ఖాయం అనిపిస్తుంది. ఈ ఆధ్యాత్మిక చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.
జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.

More News

బోయ‌పాటి మూవీలో నాగ్ హీరోయిన్..!

స‌క్సెస్ ఫుల్ మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఈ చిత్రాన్ని సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

చరణ్ సరసన కూడా...

రామ్ చరణ్ ధృవ ఈ డిసెంబర్ 9న థియేటర్స్ లో రానుంది.అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో

ఖైదీ నెం 150 టీజ‌ర్ రెడీ..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ తెర‌కెక్కిస్తున్న ఖైదీ నెం 150 ఈ రోజుతో షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.

ఆ...అకౌంట్ నాది కాదంటున్న హన్సిక..!

తెలుగు,తమిళ,హిందీ చిత్రాల్లో నటిస్తున్న అందాల తార హన్సిక సోషల్ మీడియాలో ఏక్టీవ్ గా ఉంటుంది.

ర‌వితేజ సినిమా గురించి కొత్త వార్త‌..!

మాస్ మ‌హా రాజా ర‌వితేజ హీరోగా దిల్ రాజు ఒక్క‌డొచ్చాడు సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేయ‌డం...ప్రారంభోత్స‌వం జ‌రిగిన త‌ర్వాత సెట్స్ పైకి వెళ్ల‌కుండా సినిమా ఆగిపోవ‌డం జ‌రిగింది. కార‌ణం...రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ర‌వితేజ‌, దిల్ రాజు మ‌ధ్య డిఫ‌రెన్స్ వ‌చ్చాయంటూ వార్త‌లు వ‌చ్చాయి.