నాగ్ సెట్ లో సందడి చేసిన ప్రగ్యా
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస సమ్రాట్ నాగార్జున - దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్న నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రాన్ని మహేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 2 నుంచి అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో వేసిన టెంపుల్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్ నటిస్తున్నారు. కంచె సినిమాతో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతుండగా ప్రగ్యా సెట్ కి వచ్చి సందడి చేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో ప్రగ్యా ముచ్చటిస్తున్నప్పటి స్టిల్స్ ను ఓం నమో వెంకటేశాయ టీమ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసింది. త్వరలోనే ప్రగ్యా పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 10 నుంచి పుణే సమీపంలో తాజా షెడ్యూల్ ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com