నాగ్ సెట్ లో సంద‌డి చేసిన ప్ర‌గ్యా

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

న‌వ‌ర‌స స‌మ్రాట్ నాగార్జున - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందుతున్న నాలుగ‌వ భ‌క్తిర‌స చిత్రం ఓం న‌మో వెంక‌టేశాయ‌. ఈ చిత్రాన్ని మ‌హేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 2 నుంచి అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో వేసిన టెంపుల్ సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో అనుష్క‌, ప్ర‌గ్యా జైస్వాల్, విమ‌లారామ‌న్ న‌టిస్తున్నారు. కంచె సినిమాతో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ప్ర‌గ్యా జైస్వాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్ లో వేసిన సెట్ లో షూటింగ్ జ‌రుగుతుండ‌గా ప్ర‌గ్యా సెట్ కి వ‌చ్చి సంద‌డి చేసింది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుతో ప్ర‌గ్యా ముచ్చ‌టిస్తున్న‌ప్ప‌టి స్టిల్స్ ను ఓం న‌మో వెంక‌టేశాయ టీమ్ ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది. త్వ‌ర‌లోనే ప్ర‌గ్యా పై ముఖ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగ‌ష్టు 10 నుంచి పుణే స‌మీపంలో తాజా షెడ్యూల్ ప్రారంభించ‌నున్నారు.

More News

కబాలి ఓ సునామి..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి.యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించిన కబాలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది.

23న నాగ్ ఇచ్చే స‌ర్ ఫ్రైజ్ ఇదేనా..

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది.

న‌రేష్ స‌ర‌స‌న ఆ హీరోయిన్‌.

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన `సీమశాస్త్రి`, `సీమటపాకాయ్‌` చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి.

బాల‌య్య సినిమా యూనిట్ గ్యాప్ తీసుకుంది

నంద‌మూరి బాల‌కృష్ణ ప్రెస్టిజియ‌స్ 100వ చిత్రం `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` రీసెంట్‌గా జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే నెక్ట్స్ షెడ్యూల్ విష‌యంలో ఇంకా ఏ మాత్రం నిర్ణ‌యం తీసుకోలేదట‌. అందుకు కార‌ణం ద‌ర్శ‌కుడు క్రిష్ అట‌.

మ‌హేష్ - కొర‌టాల మూవీ బ‌డ్జెట్ డీటైల్స్..

సూప‌ర్ స్టార్ మ‌హేష్... మురుగుదాస్ మూవీ త‌ర్వాత కొర‌టాల శివ తో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని డి.వి.వి.దాన‌య్య నిర్మించ‌నున్నారు.