బిడ్డింగ్ నేపథ్యంపై డిజిటల్ మాధ్యమంలో మొట్టమొదటిసారి రూపొందిన ‘ఆహా’ సరికొత్త గేమ్ షో ‘సర్కార్’
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో మరో సరికొత్త గేమ్ షో ‘సర్కార్’(మీ పాటే నా ఆట) ప్రేక్షకుల ముందుకు రానుంది. డిజిటల్ మాధ్యమంలో థ్రిల్లింగ్‌ను కలిగించే సరికొత్త గేమ్ షో ఇది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రముఖ నటుడు, ప్రదీప్ మాచిరాజు ఈ గేమ్ షోను హోస్ట్ చేస్తున్నారు. బిడ్డింగ్ నేపథ్యంలో సాగే తొలి గేమ్ షో ఇది. ఇందులో ట్విస్టులతో ప్రేక్షకులు థ్రిల్ అవుతారు.
టాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీలందరూ ‘సర్కార్’ గేమ్ షోలో పాల్గొని వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డిఫరెంట్ స్టైల్, ఎనర్జీ, థ్రిల్, ఫన్, ఎగ్జయిట్‌మెంట్ వంటి ఎలిమెంట్స్‌తో ఈ షో ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ ‘సర్కార్’ గేమ్ షో తొలి ఎపిసోడ్ అక్టోబర్ 28 సాయంత్రం 8 గంటలకు ‘ఆహా’లో ప్రసారం అవుతుంది. అలాగే ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు ఈ గేమ్ షో ప్రేక్షకులను మెప్పించనుంది.
తెలుగు చిత్రసీమలో తరుణ్‌భాస్కర్, విశ్వక్ సేన్, అనన్య నాగళ్ల, అభినవ్ గోమటం సహా పలువురు హీరోలు, డైరెక్టర్స్ సహా పలువురు ప్రముఖులందరూ ఈ గేమ్ షోలో భాగమవుతున్నారు.
‘సర్కార్’లో ప్రతి ఎపిసోడ్‌లో నాలుగు లెవల్స్ ఉంటాయి. ప్రతి లెవల్‌లో పార్టిసిపెంట్స్ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రతి పార్టిసిపెంట్ సమాధానం కోసం వేలం పాటలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారో వారే ఆ ఆన్సర్‌ను సొంతం చేసుకుంటారు. సరైన సమాధానం చెప్పే ప్రతిసారి అంతకు ముందు వారు గెలుచుకున్న మొత్తం రెండింతలు కావడం, మూడింతలు కావడం, ఆరింతలు కావడం ..ఇలా మూడు నాలుగు లెవల్స్ వరకు గేమ్ కొనసాగుతుంది.
ప్రతి లెవల్‌లో తక్కువ మొత్తంలో డబ్బులను కలిగి ఉన్న పార్టిసిపెంట్ గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతాడు. వెళ్లిపోయేవారు గేమ్‌లో కొనసాగుతున్న తమకు నచ్చిన వారికి ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసే సౌలభ్యం ఉంటుంది. ఫైనల్‌కు చేరుకున్న ఇద్దరి పార్టిసిపెంట్స్‌లో మూడు ప్రశ్నలకు ఎవరైతే తక్కువ సమయంలో సమాధానాలు చెప్పి ఉంటారో వారే గేమ్‌లో గెలిచినట్లు. జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్, స్పోర్ట్స్, మైథాలజీ, మ్యాథమాటిక్స్ వంటి సబ్జెక్స్‌పై ప్రశ్నలను అడుగుతారు. ప్రతి ప్రశ్నను వేసే ముందు హోస్ట్ ఏ టాపిక్ నుంచి ప్రశ్న వేస్తున్నారనే విషయాన్ని హోస్ట్ తెలియజేస్తారు.
‘సర్కార్’ గేమ్ షో డిఫరెంట్ ఫార్మేట్‌లో సాగే గేమ్. వీక్షకులకు వారి ఎమోషన్స్ పీక్స్‌లో చేరుకున్న అనుభూతిని కలిగించే గేమ్ షో ఇది. ప్రదీప్ మాచిరాజు ఎనర్జిటిక్ హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి నిమిషం ప్రేక్షకులకు ఓ ట్విస్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఎక్కడా చూసి ఉండని సరికొత్త గేమ్ షో ఇది.
ఈ దీపావళి పండుగ సమయాన నందమూరి బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’, ఆర్కా మీడియా వారి ‘అన్యాస్ టూటోరియల్’, మారుతి ‘త్రీ రోజెస్’, ప్రియమణి, రాజేంద్ర ప్రసాద నటించిన చిత్రం ‘భామా కలాపం’ ..ఇలా సరికొత్త ఒరిజినల్స్, వెబ్ షోస్‌తో ప్రేక్షకులకు అంతులేని ఆనందాన్ని అందించడానికి ‘ఆహా’ సిద్ధమైంది. వీటితో పాటు 2021న తెలుగులో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘లవ్‌స్టోరి’, క్రాక్, జాంబిరెడ్డి, నాంది, చావు కబురు చల్లగా వంటి చిత్రాలతో పాటు కుడి ఎడమైతే, లెవన్త్ అవర్, తరగతిదాటి, ది బేకర్ అండ్ ది బ్యూటీ వంటి ఒరిజినల్స్ ‘ఆహా’ తెలుగు వారింట సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments