Matarani Mounamidi: ప్రదీప్ మాచిరాజు చేతుల మీదుగా "మాటరాని మౌనమిది" చిత్రం నుంచి 'ఈ రోజేదో' లిరికల్ సాంగ్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న "మాటరాని మౌనమిది" సినిమా
చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఈ రోజేదో లిరికల్ పాటను యువ హీరో, యాంకర్ ప్రదీప్ మాచిరాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా..
ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ... నేను కూడా ఈ టీమ్ లో భాగమే అనుకుంటాను. ఈ పాట విడుదల చేయడం సంతోషంగా ఉంది. మంచి ట్యూన్ తో పాటు దర్శకుడు సుకు పూర్వాజ్ కొత్త కాన్సెప్ట్ తో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ పాటతో పాటు త్వరలో విడుదల కాబోతున్న సినిమా కూడా సక్సెస్ కావాలి. అన్నారు.
ఈ పాటకు అషీర్ లూక్ స్వరాలు అందించగా, డాక్టర్ వాసుదేవ్ సాహిత్యాన్ని అందించారు. ఆషీక్ అలీ, సోనీ కొమండూరి పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే...ఈ రోజేదో కొత్తగ ఉంది. ప్రేమో ఏమో మొదలయ్యింది. ఏ మాయ చేశావో, ఏ మంత్రం వేశావో, గాల్లో తేలుతున్నానే ఇలా. నింగిన దారం తెగిన గాలిపటంలా. అంటూ ప్రేమికుడి లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగుతుందీ పాట.
నటీ నటులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు.
సాంకేతిక వర్గం - , సినిమాటోగ్రఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ జియస్ కె మీడియా, నిర్మాత ః రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, దర్శకుడు ః సుకు పూర్వాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com