రహస్య వివాహం చేసుకున్న ప్రభుదేవా...?
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్టర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన ప్రభుదేవా పెళ్లి అయిపోయిందా? అంటే అవుననే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కొన్నిరోజుల ముందు ప్రభుదేవా తన బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో నిజం లేదట.. నిజం లేదని పెళ్లి వార్తల్లో కాదు. ప్రభుదేవా పెళ్లి చేసుకున్నాడని అయితే బంధువుల అమ్మాయిని కాదట. వెన్నునొప్పితో బాధపడుతున్న ప్రభుదేవాకు బీహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్ చికిత్స అందించిందట. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై ప్రభుదేవా కానీ.. ఆయన సంబంధిత వర్గాలు కానీ స్పందించలేదు.
దేశంలోనే నెంబర్ వన్ కొరియోగ్రాఫర్, ఇండియన్ మైకేల్ జాక్సన్ పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కెరీర్ ప్రారంభంలో రమాలతను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత క్రమంగా డైరెక్టర్ రేంజ్‌కు ఎదిగారు. డైరెక్టర్‌గా ఉన్న సమయంలో స్టార్ హీరోయిన్ అయిన నయనతారతో ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్న సమయంలో ఏమైందో ఏమో కానీ.. నయనతారతో ప్రభుదేవా విడిపోయారు. అయితే నయనతార ప్రేమ వ్యవహారం కారణంగా మొదటి భార్య రమాలత కూడా ప్రభుదేవా నుండి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న ప్రభుదేవా ఇప్పుడు రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారనే వార్త తెగ వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com