ఘనంగా ప్రభుదేవా 'లక్ష్మీ' సినిమా ఆడియో..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మాతగా ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'లక్ష్మి' ..ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమవుతుంది..డాన్స్ నేపథ్యంలో వస్తున్నఈ సినిమా లో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తుండడం విశేషం..
ఇప్పటికే రిలీజ్ అయి రెండు టీజర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రాగ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. కాగా ఈ చిత్ర ఆడియో లాంచ్ నిన్న హైద్రాబాద్ లో ఘనంగా జరిగింది.. మురళీమోహన్,క్రిష్,వివి వినాయక్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు..
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం ట్రైలర్ ని రిలీజ్ చేసిన క్రిష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకి పని చేసిన బృందానికి థాంక్స్ చెప్పారు.. హీరోయిన్ ఐశ్వర్య కి అల్ ద బెస్ట్ చెప్పారు.. ప్రభుదేవా గురించి మాట్లాడుతూ ఆయన గురించి ఏం చెప్పాలి.. ఈ సినిమాలో ఆయన నటుడు మాత్రమే కాదు.. ఒక గాడ్ ఫాదర్ కూడా.. ఆయన వెనకుండి ఈ సినిమా నడిపించారు.. చాలా థాంక్స్ సర్ అన్నారు..ఈ చిత్రానికి ఈ చిన్నారి డాన్సర్స్ చాలా బాగా కష్టపడ్డారన్నారు..
చిత్ర నటి దిత్య బండే మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు విజయ్ సర్ కి చాలా థాంక్స్.. ఒక మహారాష్ట్రియన్ అయిన నాకు తెలుగు,తమిళ్ భాషలో స్క్రిప్ట్ చెప్పిన విజయ్ సర్ టీం కి చాలా థాంక్స్.. ప్రభుదేవా సర్ తో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. అన్నారు..
దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ.. ప్రభు మాస్టర్ అంటే మా అందరికి చాలా గౌరవం.. అన్ని భాషల్లో ఆయన ఇంత గొప్ప కీర్తి సంపాదించి ఇప్పటికే లైం లైట్ లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం.. దర్శకుడు విజయ్ గురించి మాట్లాడుతూ చాలా అర్ధవంతమైన మూవీస్ తీయటంలో విజయనకి పోటీ ఎవరు లేరు.. నా సినిమా టైటిల్ ని వాడడం నాకెంతో హ్యాపీగా ఉంది.. ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు..
దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. విజయ్ నేను ఇద్దరం ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసాం.. ఇంతమంది పెద్దలుండగా నన్ను ట్రైలర్ లాంచ్ చేయమన్నందుకు ఛాయా హ్యాపీ గ ఉంది.. కళ్యాణ్ గారు గొప్ప ప్రొడ్యూసర్ అయన తీసుకున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఇక్కడికి చాల మాట్లాడాలని ఇక్కడికి వచ్చినా.. కానీ ప్రభుదేవా గారి పక్కన కూర్చున్న తర్వాత ఎం మాట్లాడాలో అర్థం కావట్లేదు అన్నారు.. నా ఇంటర్మీడియెట్ లో వారి ప్రేమికుడు సినిమా చూసాను.. మళ్ళీ ఇన్నాళ్ల తరువాత అయన పక్కనే కూర్చునే అవకాశం దక్కింది.. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. దిత్య డాన్స్ చేస్తుంటే ప్రభుదేవగారే కనిపించరు.. ఆ అమ్మాయి అంత చాల బాగా చేసింది.. ప్రభుదేవాగారు ఆమె వెనుక ఉంటేనే అది సాధ్యం అని అయన అన్నారు..
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. అందరికి నమస్కారమండి.. కళ్యాణ్ గారు నాకు పాతికేళ్ళనుండి తెలుసు.. అయన ఎం ముట్టుకున్నా అది బంగారమే.. ఈ సినిమా ఇంకో లాంగ్వేజ్ నుంచి ఇక్కడికి వచ్చింది.. మంచి పాజిటివ్ సినిమా.. తప్పకుండ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. చిన్నపిల్లల టాలెంట్ బయటికి బయట చూపే ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అవుతుంది అన్నారు..
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. చాలా భాషల్లో నటించిిిన నేను తెలుగు లో చేయడానికి చాలా టైం పట్టింది.. ఈ లక్ష్మీ సినిమాలో నేను హీరోయిన్ అని చెప్పాను.. ఇందులో నేను ఓ కారెక్టర్ ఆర్టిస్ట్ ని మాత్రమే.. అయిన ఈ పాత్ర నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది.. ఈ అవకాశం నాకిచ్చినందుకు విజయ్ సర్ కి, ప్రభు సర్ చాలా థాంక్స్ అన్నారు..
హీరో ప్రభుదేవా మాట్లాడుతూ.. ఇంత పెద్ద సెలబ్రేషన్ ల సినిమా ఆడియో ని సెలెబ్రెట్ చేస్తున్నకళ్యాణ్ గారికి చాలా థాంక్స్.. హైదరాబాద్ కి వస్తే నాకేదో పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.. అన్నారు.. సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా డాన్స్ సినిమా అనేకంటే ఎమోషనల్ ఫిల్మ్ అని చెప్పొచు.. విజయ్ గారికి ఇది బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.. దిత్య గురించి మాట్లాడుతూ సూపర్ డాన్సర్ అన్నారు.. ఆమెతో డాన్స్ నేను మేనేజ్ చేసాను.. తను మాత్రం చాలా బాగా చేసింది.. అన్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com