ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీ...
Friday, April 7, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నడిగర్‌సంఘం ఎన్నికలతో పాటు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా విశాల్, కార్తీ అండ్ టీం పాగా వేసింది. నడిగర్ సంఘం భవనం కోసం విరాలాల సేకరణను మొదలు పెట్టింది.
విశాల్, కార్తీలు ఈ భవనం కోసం అల్రెడి 10 కోట్ల రూపాయలను విరాళం ప్రకటించినా, ఇంకా నిధులు అవసరం కావడంతో విశాల్, కార్తీలు కలిసి ఓ చిత్రంలోనటించబోతున్నారని, ఈ సినిమాకు కొరియోగ్రాపర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా డైరెక్షన్ చేయబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా సయేషా సైగల్‌ను తీసుకోనున్నారని కూడా తమిళ సినీ వర్గాల సమాచారం. మరి ఈ చిత్రం యాక్షన్ ప్రధానంగా ఉంటుందా, లేక కామెడి ప్రధానంగా ఉంటుందా అని తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments