ఈ జనరేషన్ లో తమన్నాయే బెస్ట్ డ్యాన్సర్ : ప్రభుదేవా

  • IndiaGlitz, [Monday,September 12 2016]

మిల్కీ బ్యూటీ తమన్నా టైటిల్ పాత్రధారిగానే కాకుండా తొలిసారి నటించిన హర్రర్ థ్రిల్లర్ మూవీ అభినేత్రి. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా తమన్నా భర్త పాత్రలో నటిస్తున్నాడు. సోనూసూద్ సూపర్ స్టార్ పాత్రలో కనిపిస్తాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎం.వి.వి. సినిమా ప్రొడక్షన్స్, కోన ఫిలింస్ కార్పొరేషన్, బ్లూ సర్కిల్ కొర్పొరేషన్, బ్లూ సినిమా బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. తెలుగులో ఈ చిత్రాన్ని కోనవెంకట్ విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో బ్రిటీష్ సుంద‌రి ఎమీ జాక్స‌న్ ఈ చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించింది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జరుపుకుంటుంది. సినిమాను అక్టోబర్ 7న విడుదల చేస్తున్నారు. సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రమోషన్ లో భాగంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుదేవా తమన్నా చాలా చక్కగా డ్యాన్స్ చేసిందని అన్నాడు. చాలా మంది మంచి డ్యానర్స్ ఉన్నారు. అయితే తమన్నా చాలా పర్ ఫెక్షనిస్ట్, నేను చూసిన ఈ తరం హీరోయిన్స్ లో తనే బెస్ట్ డ్యానర్స్ అంటూ మిల్కీ బ్యూటీని ఆకాశానికెత్తేశాడు ప్రభుదేవా.