ప్రేమంటే సూపర్...అయితే ఆ విషయం గురించి ఇప్పుడు ఏమీ మాట్లాడను - ప్రభుదేవా
Send us your feedback to audioarticles@vaarta.com
కొరియోగ్రాఫర్ గా, హీరోగా, డైరెక్టర్ గా...ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పచుకుని..ముఖ్యంగా ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే క్రేజు - ఇమేజు సొంతం చేసుకున్న గ్రేట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా. తాజాగా తమిళ్ లో నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం దేవిల్. ఈ చిత్రం తెలుగులో అభినేత్రి అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రాన్ని విజయ్ తెరకెక్కించారు. హర్రర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన అభినేత్రి చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవాతో ఇంటర్ వ్యూ మీకోసం...!
అభినేత్రి ప్రాజెక్ట్ ఎలా సెట్ అయ్యింది..?
గణేష్ అని నాకు బాగా తెలిసిన వ్యక్తి ఈ మూవీని ప్రొడ్యూస్ చేద్దాం అన్నాడు. ఈ కథను వేరే హీరోకు చెప్పడం కోసం ప్రయత్నించాం కానీ...కొన్ని కారణాల వలన కుదరలేదు. అప్పుడు గణేష్ & డైరెక్టర్ విజయ్ ఆ క్యారెక్టర్ ను మీరే చేయండి బాగుంటుంది అన్నారు. కథ నాకు తెలుసు బాగా నచ్చింది వీళ్లు కూడా నేను చేస్తే బాగుంటుంది అనడంతో ఓకే చెప్పాను. ఆవిధంగా ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది.
ఈ కథలో ముందు నుంచి డ్యాన్స్ కి ప్రాధాన్యత ఉందా..? లేక మీరు వచ్చిన తర్వాతే డ్యాన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారా..?
ఈ మూవీలో నేను చేస్తున్నాను అని కన్ ఫర్మ్ అయిన తర్వాతే డ్యాన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ స్ర్కిప్ట్ లో ఛేంజెస్ చేసారు.
హర్రర్ జోనర్ లో చాలా సినిమాలు వస్తున్నాయి కదా...దీనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి..?
నేను హర్రర్ జోనర్ లో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాబట్టి నాకు కొత్తగా అనిపించింది. అలాగే ప్రజెంట్ హర్రర్ జోనర్ లో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఇది కొత్తగా ఉంటుంది. ఈ మూవీ ప్రత్యేకత గురించి చెప్పాలంటే...హర్రర్ మూవీస్ లో దెయ్యం చూపిస్తారు కానీ మా సినిమాలో దెయ్యం ఉంటుంది కానీ ఎక్కడా కనపడదు.
ఇంతకీ...అభినేత్రి కథ ఏమిటి..?
ఒక అబ్బాయి మోడ్రన్ గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు కానీ...పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే అలా జరగడం అబ్బాయికి నచ్చదు. ఆతర్వాత వాళ్ల జర్నీలో జరిగే సంఘటనలతో తన భార్యను ప్రేమించడం మొదలుపెడతాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న వాళ్ల లైఫ్ లోకి వేరే వ్యక్తి వస్తాడు ఆతర్వాత ఏం జరిగింది అనేదే అభినేత్రి కథ.
హర్రర్ అనగానే కామెడీని మిక్స్ చేస్తున్నారు...ఇందులో కూడా అలాగే కామెడీ ఉంటుందా..?
కామెడీ ఉంటుంది అయితే...రెగ్యులర్ హర్రర్ మూవీస్ లో చూపిస్తున్నట్టుగా దెయ్యం చూసి భయపడడం....ఆ భయం నుంచి కామెడీ పుట్టించడం ఇలా ఉండదు. ఇంతకు ముందు చెప్పినట్టుగా అసలు దెయ్యమే ఇందులో కనిపించదు. డిఫరెంట్ స్ర్కీన్ ప్లేతో చాలా ఇంట్రస్టింగ్ గా ఉండేలా విజయ్ తెరకెక్కించారు.
ఈ సినిమాతో నిర్మాతగా మారారు కదా...రిజల్ట్ గురించి టెన్షన్ పడుతున్నారా..?
ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాతగా పేరు మాత్రమే నాది డబ్బులు పెట్టింది నేను కాదు నా సన్నిహితుడు గణేష్. అందుకే నాకు టెన్షన్ లేదు (నవ్వుతూ..)
చాలా సినిమాలకు కొరియోగ్రఫీ చేసారు కదా...! ఇప్పటికీ కొరియోగ్రఫీ చేయాలంటే అదే ఉత్సాహం ఉంటుందా..?
కొరియోగ్రఫీ చేయడం అంటే నాకు కిక్ ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు ఎలా ఫీలయ్యేవాడినో ఇప్పుడు అదే కిక్.ఇందులో ఎలాంటి తేడా లేదు.
డ్యాన్స్ పరంగా రీసెంట్ గా మీకు నచ్చిన తెలుగు పాటలు ఏమిటి..?
హైదరాబాద్ లో ఇప్పుడు మాస్టర్స్ అందరూ డ్యాన్స్ బాగా చేయిస్తున్నారు. రీసెంట్ గా నేను చూసిన పాటల్లో బన్ని టాపులేచిపొద్ది సాంగ్, చరణ్ మెగా మీటర్ సాంగ్, ఎన్టీఆర్ ఫాలో ఫాలో సాంగ్స్ కొరియోగ్రఫీ నాకు బాగా నచ్చాయి.
ఇటీవల మీరు, నాన్నగారు కలిసి ఓ షోలో పాల్గొన్నారు కదా..! ఎలా ఫీలయ్యారు..?
నేను షూటింగ్ లో బిజీగా ఉండడం వలన చాలా రోజులు నుంచి నాన్నను కలవడం కుదరలేదు. నాలుగు నెలలుగా చూడలేదు ఇక రెండు రోజుల్లో వెళ్లి నాన్నను కలవాలి అనుకుంటున్నాను. ఆ టైమ్ లో స్టార్ ప్లస్ డ్యాన్స్ షోకి నన్ను గెస్ట్ గా పిలిచారు. షో జరుగుతుంటే...సడన్ గా నాన్న వచ్చారు నాకు అసలు తెలియదు. పైగా ఆ షోకి అమ్మ కూడా వచ్చింది. అప్పుడు నాన్న, నేను కలిసి డ్యాన్స్ చేయడం అదీ.. అమ్మ ముందు స్టేజ్ పై చేయడం మరచిపోలేని అనుభూతి ఇచ్చింది.
కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, నిర్మాత...నెక్ట్స్ ఏమిటి..?
ఏది కూడా నేను ప్లాన్ చేసి చేసింది కాదు. అలా జరిగిపోయింది అంతే..! కొరియోగ్రాఫర్ గా చికుబుకు రైలే....సాంగ్స్ లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే హీరోగా చేయమని ఆఫర్ వచ్చింది చేసాను. అలాగే వర్షం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎం.ఎస్ రాజు గారు ప్రభు నువ్వు డైరెక్షన్ చేస్తావా అని అడిగారు ఓకే చెప్పాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ అవ్వడం కూడా గణేష్ మీ పేరుతో ప్రొడ్యూస్ చేస్తాను అంటే ఓకె చెప్పాను. సో...నేను ఏది ప్లాన్ చేయను. మనం నెక్ట్స్ అది చేయాలి ఇది చేయాలి అనుకుంటే ప్రశాంతంగా ఉండలేం. అందుకని ఇప్పుడు ఎలా ఉన్నాం అనేదే ఆలోచిస్తాను. మా పిల్లలకు కూడా అదే చెబుతుంటాను.
ప్రేమకు మీరిచ్చే నిర్వచనం ఏమిటి..?
ప్రేమంటే సూపర్..! (నవ్వుతూ..)
మరి...బ్రేక్ అప్ అంటే..?
దాని గురించి ఇప్పుడు నేను ఏమీ మాట్లాడను. అది అయిపోయింది అంతే..!
బాలీవుడ్ లో ఓ మూవీ చేయనున్నారు కదా...డీటైల్స్ చెబుతారా..?
డిసెంబర్ లో ఈ మూవీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. పూర్తి వివరాలు త్వరలో ఎనౌన్స్ చేస్తాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com