ప్రభుదేవా లక్ష్మి టీజర్ విడుదల
- IndiaGlitz, [Thursday,March 15 2018]
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్ తారాగణంగా ప్రమోద్ ఫిలింస్, ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై విజయ్ దర్శకత్వంలో ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీ' ఈ సినిమా పాత్రికేయుల సమావేశం గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
ఈ సందర్భంగా... ప్రభుదేవా మాట్లాడుతూ - ''దర్శకుడు విజయ్ నాకు సోదరుడితో సమానం. తనతో 'అభినేత్రి' సినిమా చేయడం గొప్ప అనుభవం. తర్వాత మా కాంబినేషన్లో అభినేత్రి 2 సినిమా చేద్దామని కూడా అనుకున్నాం. ఆ సమయంలో ఈ స్క్రిప్ట్ విన్నాను. చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం.
శామ్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. సినిమా చూస్తే రేపు ఆడియెన్స్‌కు అర్థమవుతుంది. డాన్స్ ఫిలిం చేయాలని విజయ్ అంటే.. ఓ రేంజ్లో చేయాలని అనుకున్నాను. నిర్మాతలు కూడా నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.
డాన్స్ మూవీస్ వచ్చి చాలా రోజులయ్యాయి. ఈ సినిమాలో నటించిన పిల్లలందరూ చాలా బాగా చేశారు. నేను అన్నట్లుగానే సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. ఇండియా మొత్తం నుండి పిల్లలను ఎంపిక చేశారు. ఈ పిల్లలతో చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది'' అన్నారు.
దర్శకుడు ఎ.ఎల్.విజయ్ మాట్లాడుతూ - ''ప్రభుదేవా డాన్సింగ్ లెజెండ్. ఆయనతో ఎప్పుడు సినిమా చేసినా ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియెన్స్. మంచి స్క్రిప్ట్ సెన్స్ ఉన్న వ్యక్తి ప్రభుదేవాగారు. నిర్మాతలు శృతి, ప్రతీక్‌లు చక్కగా సినిమా చేశారు'' అన్నారు.
శృతి నల్లప్ప మాట్లాడుతూ - ''ప్రభుదేవాగారితో సినిమా చేయడం నా కల. ఈ సినిమాతో అది నేరవేరినందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.
ప్రతీక్ మాట్లాడుతూ - ''మేం ప్రభుదేవా గారితో సినిమా చేయాలని ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోలేదు. ఏదో అలా జరిగింది. తెలుగులో మా బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో మరిన్ని సినిమాలు చేస్తాం'' అన్నారు.
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్, బేబి దిత్యా బాండే, సల్మాన్ యూసఫ్ ఖాన్, సోఫియా, కోవై సరళ, సత్యం రాజేష్, చామ్స్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్: శామ్ సి.ఎస్, కెమెరా: నిరవ్ షా, డైలాగ్స్: సత్య, సాహిత్యం: వనమాలి, కొరియోగ్రఫీ: పరేశ్ సిరోద్కర్, రుయెల్ డౌసన్ వరిందని, స్టంట్స్: స్టంట్ సిల్వ, ఆర్ట్: ఎ.రాజేశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గణేశ్, ఓమార్, నిర్మాతలు: ప్రతీక్ చక్రవర్తి, శృతి నల్లప్ప, ఆర్.రవీంద్రన్, రచన, దర్శకత్వం: విజయ్.