కుంగ్‌ఫూ చిత్రంలో ప్ర‌భుదేవా...

  • IndiaGlitz, [Wednesday,August 22 2018]

ఇండియ‌న్ మైకేల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా డైరెక్ష‌న్‌కే ప‌రిమిత‌మైయారు. అయితే ఈ మ‌ధ్య మ‌ళ్లీ ఆయ‌న న‌టుడిగా మ‌ళ్లీ బిజీ కావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. మూకీ చిత్రం మెర్క్యురీలో పూర్తిస్థాయి విల‌న్‌గా న‌టించిన ప్ర‌భుదేవా.. ఇప్పుడు డాన్స్ చిత్రం ల‌క్ష్మిలో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు.

ఇప్పుడు పోలీస్ ఆఫీస‌ర్‌గా కూడా ప్ర‌భుదేవా న‌టించ‌నున్నారు. దీంతో పాటు కుంగ్‌ఫూకు సంబంధించి బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రంలో న‌టిస్తున్నాడట‌. అలాగే సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా కూడా ఓ చిత్రంలో న‌టించ‌నున్నార‌ట ప్ర‌భుదేవా. ఒక ప‌క్క ద‌ర్శ‌కుడిగా.. మ‌రో ప‌క్క న‌టుడిగా బిజీగా ఉన్న ప్ర‌భుదేవా తెలుగు సినిమా పాట‌ల‌ను చూడ‌టానికి ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.