ప్రేమ పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభుదేవా!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివాహమై ప్రభుదేవాకు పిల్లలున్నారు. అయితే స్టార్ హరోయిన్ నయనతారతో ప్రేమలో పడి భార్య రామలతకు విడాకులు ఇచ్చేశారు. ఆ తరువాత నయన్‌తో పెళ్లి పీటల వరకూ వెళ్లిన ప్రేమ కారణాలు తెలియవు కానీ ఫుల్ స్టాప్ పడిపోయింది. దీంతో అప్పటి నుంచి ప్రభుదేవా తన కుటుంబానికి దూరమై ఒంటరిగానే ఉంటూ వస్తున్నారు.
కాగా.. గత కొంత కాలంగా ప్రభుదేవా తన బంధువుల అమ్మాయితో ప్రేమతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా ప్రభుదేవాను ఇష్టపడుతోందట. దీంతో వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వార్తలపై ప్రభుదేవా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా `రాధే` సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout