నా కెరియర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇదే.. ప్రభుదేవా

  • IndiaGlitz, [Monday,April 09 2018]

తన ప్రతి సినిమాతో  విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న కార్తిక్ సుబ్బరాజ్ నిశ్శబ్ధంతో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతున్నారు.  ప్రయోగాలకు కమర్షియల్ సక్సెస్ లను జతచేయడం తెలిసిన ఈ బ్రిలియంట్ డైరెక్టర్  'మెర్క్యురి' తో కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందించబోతున్నాడు.

ప్రభుదేవా ప్రధాన పాత్రలో పెన్‌ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ సమర్పణలో.. కార్తీకేయన్‌ సంతానం, జయంతి లాల్‌ నిర్మించిన సైలెంట్‌ చిత్రం 'మెర్క్యురి'. ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. తెలుగులో కె.ఎఫ్‌.సి. ప్రొడ‌క్ష‌న్‌ సినిమాను విడుద‌ల చేస్తుంది. ఆదివారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత కార్తికేయ‌న్ సంతానం మాట్లాడుతూ - ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. యూనిక్ పాయింట్‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. 30 ఏళ్ల ముందు క‌మ‌ల్‌హాస‌న్‌గారు పుష్ప‌క‌విమానం అనే మూకీ సినిమాను చేశారు. త‌ర్వాత ఇప్పుడు మూకీ సినిమాను మా బ్యాన‌ర్‌లో చేశాం.

కార్తీక్ సుబ్బ‌రాజ్ టేకింగ్‌, ప్ర‌భుదేవా న‌ట‌న, సినిమా మేకింగ్ ప్రేక్ష‌కుల‌ను అద్భుత‌మైన ఫీలింగ్‌ను క‌లిగిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్ థ్రిల్ల‌ర్ జోన్‌లో తెర‌కెక్కింది. బాహుబలి లాగా  ఇండియ‌న్ సినిమాను నెక్స్‌ట్ లెవ‌ల్‌కు తీసుకెళుతుంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌ అన్నారు.

కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ - ద‌ర్శ‌కుడిగా 'మెర్క్యురి' నా నాలుగో చిత్రం. నా తొలి చిత్రం పిజ్జా తెలుగులో కూడా మంచి స‌క్సెస్‌ను అందుకుంది. ఇదొక థ్రిల్ల‌ర్ మూవీ. సైలెంట్ ఫిలిం. సినిమాలో ఏ భాష ఉండ‌దు. ఏప్రిల్ 13న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇలాంటి ఓ డిఫరెంట్ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది. ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది.

ఎమోష‌న‌ల్‌గా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఇందులో విల‌న్ పాత్ర యూనిక్‌గా ఉంటుంది. ఎవ‌రైనా గొప్ప న‌టుడు చేస్తే బావుంటుంద‌ని భావించాను. అప్పుడు ప్ర‌భుదేవాగారు గుర్తుకొచ్చారు. ఆయ‌న‌కు చెప్ప‌గానే.. ఆయ‌న‌కు న‌చ్చి చేయ‌డానికి ఒప్పుకున్నారు.

ఇందులో పాట‌లు, డాన్సులు ఉండ‌వు. త‌మిళ‌నాడులో స్ట్ర‌యిక్ న‌డుస్తుండ‌టంతో.. త‌మిళ‌నాడు మిన‌హా అన్ని ప్రాంతాల్లో సినిమాను విడుద‌ల చేస్తాం. స్ట్ర‌యిక్ త‌ర్వాత త‌మిళంలో కూడా సినిమాను విడుద‌ల చేస్తాంఅన్నారు.

ప్ర‌భుదేవా మాట్లాడుతూ - మంచి సినిమా. ఎంట‌ర్‌టైనింగ్‌, మాస్ ఫిలిం. నా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. సెట్స్ కి వెళ్ళగానే డైరెక్టర్ ని ఫాలో అయ్యాను. నేను చేయకపోయినా ఈ సినిమా బెస్ట్ అనే చెబుతాను. ఆడియన్స్ ఈ సినిమా ఎప్పుడు చూస్తారా.. వారి రియాక్షన్స్ కోసం ఎదురు చేస్తున్నాను.

కార్తిక్ చేసిన సినిమాలలో ఇదే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. టెక్నికల్ గా ఈ మూవీ కొత్త స్టాండెర్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. విల‌న్‌గా చేయ‌డం ఎగ్జ‌యిట్‌మెంట్ అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు క్యారెక్ట‌ర్స్ మాత్ర‌మే క‌న‌ప‌డ‌తాయి.

సినిమా ప్ర‌తి ఫ్రేమ్ ఎగ్జ‌యిట్‌మెంట్‌తో సాగుతుంది. విల‌న్ పాత్ర చేయ‌డానికి ఇన్‌స్పిరేష‌న్ లేదు. ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్‌ పై న‌మ్మ‌కంతో సినిమాలో న‌టించాను. కార్తీక్ బ్రిలియంట్ డైరెక్ట‌ర్‌ అన్నారు.

More News

'RX 100' జూన్‌లో విడుద‌ల‌!

రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ సౌండ్ ఎక్క‌డ వినిపించినా గుండెల్లో గుబులు పుట్టించే విల‌న్ గుర్తొస్తాడు. స్కూటీ.. అన‌గానే చ‌లాకీగా న‌వ్వుతూ, చ‌క్క‌గా తుళ్లుతూ తిరిగే అంద‌మైన  అమ్మాయి గుర్తుకొస్తుంది.

ప్ర‌భాస్, పూజా హెగ్డే మూవీ అప్‌డేట్‌

ప్రస్తుతం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్‌.. యువ ద‌ర్శ‌కుడు సుజిత్ రూపొందిస్తున్న 'సాహో' సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

వరుస సినిమాల‌తో ర‌వితేజ బిజీబిజీ

కథానాయకుడిగా సినిమాలు చేస్తున్నప్పటినుంచి  ప్రతీ ఏటా కనీసం ఒక్క సినిమా అయినా విడుదల అయ్యేట్టు ప్లాన్ చేసుకున్నారు హీరో రవితేజ.

'సాహో' తాజా షెడ్యూల్ గురించి సాబు సిరిల్ ఏమ‌న్నారంటే..

నాలుగు సార్లు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డుల‌ను కైవసం చేసుకున్నారు సాబు సిరిల్. ఐదు సార్లు బెస్ట్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఫిలింఫేర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు.

'భ‌ర‌త్ అనే నేను'.. ఆ రెండు సెంటిమెంట్స్‌

సినిమా ప‌రిశ్ర‌మ‌ అంటేనే సెంటిమెంట్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. అందుకే ముహూర్తం షాట్ నుంచి విడుదల తేదీ వరకు ప్రతీది కూడా గతంలో జరిగిన  అంశాలను, కాంబినేషన్‌లను పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.