అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రబోధానంద
- IndiaGlitz, [Thursday,July 09 2020]
త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానంద నేడు అనారోగ్యంతో తాడిపత్రిలో మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. 1950లో జన్మించిన ప్రబోధానంద అసలు పేరు పెద్దన్న చౌదరి. ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె. తొలుత భారత సైన్యంలో పని చేసిన ప్రబోధానంద.. అక్కడి నుంచి వచ్చి ఆర్ఎంపీ వైద్యుడుగా కొనసాగారు.
అనంతరం త్రైత సిద్ధాంతం పేరుతో ప్రబోధానంద తాడిపత్రి మండలంలోని చిన్న పొడిమలలో ఆశ్రమాన్ని.. తాడిపత్రిలో శ్రీకృష్ణ మందిరాన్ని నెలకొల్పారు. త్రైత సిద్ధాంతం పేరుతో ఆయన ఎన్నో పుస్తకాలను సైతం రాశారు. దేవుడు ఒక్కడేనని.. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేనని.. ఇదే త్రైత సిద్ధాంతం చెబుతోందని ప్రబోధానంద వెల్లడించారు.