షాక్ ఇచ్చిన ప్ర‌భాస్..

  • IndiaGlitz, [Monday,March 14 2016]

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బాహుబ‌లి 2 సినిమాలో న‌టిస్తూ...ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీలో కూడా ప్ర‌భాస్ త‌న ఇంట్లో ప‌నిచేసే ప‌ని మ‌నిషి పెళ్లికి హాజ‌రై అక్క‌డున్న వారికి షాక్ ఇచ్చాడు. ప్ర‌భాస్ ఇంట్లో ప‌ని చేసే ప‌నిమ‌నిషి పెళ్లి హైద‌రాబాద్ చందాన‌గ‌ర్ లో జ‌రిగింది. ప్ర‌భాస్ షూటింగ్ లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ టైమ్ కుదుర్చుకుని పెళ్లికి హాజ‌ర‌య్యారు.

ప్ర‌భాస్ పెళ్లికి హాజ‌రు కావ‌డంతో నూత‌న దంప‌తుల ఆనందం వ్య‌క్తం చేసారు. ప్ర‌భాస్ చందాన‌గ‌ర్ రాగానే కొన్ని నిమిషాల్లో ఆ వార్త చుట్టుప‌క్క‌ల తెలిసిపోయింది. నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించి ప్ర‌భాస్ కొన్ని నిమిషాలు అక్క‌డున్న వారితో మాట్లాడారు.ఇక‌ ప్ర‌భాస్ పెళ్లి విష‌యానికి వ‌స్తే.. ఈ సంవ‌త్స‌రంలోనే పెళ్లి చేసుకుంటాన‌ని పెద‌నాన్న‌కి మాట ఇచ్చారు. మ‌రి ప్ర‌భాస్ మాట మీద నిల‌బ‌డ‌తాడో లేదో..?