వర్మ హీరోతో ప్రభాస్ వార్...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి2 సినిమాతో ఈ ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ రన్ రాజా ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా రీసెంట్గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బాహుబలి-2 రిలీజ్ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జరగనుంది.
యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో రూపొందనున్న ఈ సినిమాలో ఎమీజాక్సన్ హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్స్గా శంకర్, ఇషాన్, లియో పనిచేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఓబ్రాయ్ విలన్గా నటిస్తాడు. గతంలో వివేక్ ఓబ్రాయ్ వర్మ రక్తచరిత్రలో పరిటాల రవీంద్ర పాత్రలో నటించాడు. ప్రభాస్ ఈ చిత్రంలో పవర్పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడబోతున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments