ప్రభాస్ కి కోపం తెప్పించిన పవన్ ఫ్యాన్స్...

  • IndiaGlitz, [Tuesday,December 08 2015]

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రం ఆడియో వేడుక‌కు ముఖ్యఅతిధిగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హాజ‌ర‌యి..ఆడియోను ఆవిష్క‌రించారు. అయితే ప్ర‌భాస్ మాట్లాడేందుకు మైకు అందుకున్న స‌మ‌యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్...ప‌వ‌ర్ స్టార్ ..ప‌వ‌ర్ స్టార్ అంటూ అరుపులు...కేక‌లు...ఎంత‌కీ ఆప‌క‌పోవ‌డంతో...ప్ర‌భాస్ కి కోపం వ‌చ్చింది. ఐ లైక్ ప‌వ‌ర్ స్టార్..ఇప్పుడు మాట్లాడ‌చ్చా..అని అడిగి మాట్లాడాడు.

మెగా హీరో ఆడియో ఫంక్ష‌న్ అని తెలిసినా...పూరి అడిగాడ‌ని అభిమానంతో ప్ర‌భాస్ వ‌చ్చాడు. అతిథిని గౌర‌వించ‌డం మ‌న సంప్ర‌దాయం. కానీ..ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ఆ సంప్ర‌దాయం గురించి తెలియ‌ద‌నుకుంట‌. తెలిస్తే..ఇలా చేయ‌రు. లోఫ‌ర్ ఆడియో వేడుక‌లోనే కాదు...గ‌తంలో నితిన్ న‌టించిన చిన్న‌దాన‌ నీకోసం ఆడియో ఫంక్ష‌న్ లో కూడా ఇలాగే చేసారు. చిన్న‌దాన‌ నీకోసం ఆడియోకి అతిధిగా కింగ్ నాగార్జున వ‌చ్చారు. అప్పుడు కూడా అంతే నాగ్ మాట్లాడుతుంటే ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌వ‌ర్ స్టార్..ప‌వ‌ర్ స్టార్ అంటూ స్లోగ‌న్స్. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎప్పుడు మార‌తారో..? మేమింతే మారం అంటే మెగా హీరోల ఆడియో ఫంక్ష‌న్స్ కి బ‌య‌ట హీరోలును పిలిచినా రాని ప‌రిస్థితి ఏర్ప‌డ‌డం ఖాయం.

More News

బాలీవుడ్ లో డిక్టేటర్...

నందమూరి నట సింహం బాలక్రిష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

పవన్ ప్రొడ్యూసర్ కి కోపం వచ్చింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు.

అదే లోఫర్ సక్సెస్ అంటున్న పూరి

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్..తెరకెక్కించిన తాజా చిత్రం లోఫర్.ఈ చిత్రంలో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా నటించారు.

చిరంజీవి రాకపోవడానికి రీజన్ అదేనట...

మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పుడు ఆరడజను మంది హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు.

నారారోహిత్ కు హీరోయిన్ దొరికింది...

ఇమేజ్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరో నారా రోహిత్ చేతి నిండా సినిమాలతో ఉన్నాడు.