Prabhas in Mogalthur: 12 ఏళ్ల తర్వాత స్వగ్రామానికి ప్రభాస్... జనసంద్రాన్ని తలపించిన మొగల్తూరు
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల కన్నుమూసిన దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ గురువారం ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీనటుడు ప్రభాస్ సహా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే ప్రభాస్ వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో మొగల్తూరుకు తరలివచ్చారు. దీంతో వారందరికీ తమ ఇంటిపై నుంచే అభివాదం చేశారు ప్రభాస్. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని యంగ్ రెబల్ స్టార్ అభిమానులు, గ్రామ ప్రజలను కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దాదాపు 12 ఏళ్ల తర్వాత తన స్వగ్రామానికి చేరుకున్నారు. 2010లో ఆయన తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు కన్నుమూసిన సమయంలో ఆయన ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా వుండటంతో ప్రభాస్ మొగల్తూరుకు రావడం వీలుపడలేదు. ఈ నేపథ్యంలో దాదాపు పుష్కరకాలం తర్వాత తమ అభిమాన నటుడు వస్తున్నాడని తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు.. వూరంతా పోస్టర్లు, బ్యానర్లతో నింపేశారు. గురువారం బైక్ ర్యాలీలు, రెబల్ స్టార్, డార్లింగ్ నినాదాలతో మొగల్తూరు మారుమోగిపోయింది.
కాగా.. ఈ నెల 11న కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైన సంగతి తెలిసిందే. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌస్‌లో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిసిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com