ఎన్టీఆర్ 30లో ప్రభాస్ విలన్...?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రతినాయకుడిగా ప్రభాస్ సినిమాలో నటిస్తోన్న విలన్ కనిపించబోతున్నాడా? అంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు. వివరాల మేరకు.. ఎన్టీఆర్ తదుపరి చిత్రం, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ విలన్‌ను నటింప చేయాలని ముందు నుంచి త్రివిక్రమ్ బలంగా అనుకుంటున్నాడు. అందుకు కారణం... త్రివిక్రమ్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించాలనుకోవడమేనట. ముందు ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తాడని అనుకున్నారు. కానీ.. సంజూ బాబా అందుకు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడితో త్రివిక్రమ్ సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్ వినిపిస్తోంది.
సినీ వర్గాల సమాచారం మేరకు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను నటింప చేయడానికి త్రివిక్రమ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ నటిస్తోన్న ఆది పురుష్‌లో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్.. చరణ్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments