శ్రీమంతుడుగా మారిన ప్రభాస్
- IndiaGlitz, [Monday,September 07 2020]
శ్రీమంతుడుగా ప్రభాస్..! అదేంటి శ్రీమంతుడు మహేశ్ కదా!! అనే సందేహం చాలా మందికి వచ్చుండొచ్చు. కానీ మహేశ్ హీరోగా చేసిన శ్రీమంతుడు చిత్రం చూసిన తర్వాత చాలా మంది గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధిలో తమ వంతుగా భాగమయ్యారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అదే బాటలోకి అడుగు పెట్టారు. వివరాల్లోకెళ్తే.. పార్లమెంట్ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో దశలో పాల్గొన్న ప్రభాస్ అప్పట్లో వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకుని మొక్కలు నాటుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో ప్రభాస్ హైదరాబాద్ అవుటర్ రింగురోడ్డు సమీపంలోని ఖాజీ పల్లె అనే ఓ పల్లెను దత్తత తీసుకున్నారట. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌తో పాటు పలువురు తెలంగాణ మంత్రులు కూడా పాల్గొన్నారు.
సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల్సి ఉంది. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్వకత్వంలో ఓ సైన్స్ ఫిక్షనల్ మూవీ, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమాలో నటించాల్సి ఉంది. ఈ మూడు చిత్రాలు ప్యాన్ ఇండియా లెవల్లోనే రూపొందుతుండటం విశేషం.