కార్ల వ్యాపారిగా ప్రభాస్
Send us your feedback to audioarticles@vaarta.com
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో యు.వి. క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు ప్రభాస్ హీరోగా మరో సినిమా కూడా ప్రారంభమైంది. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే సినిమాను ఆమధ్య పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందనే విషయంలో దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథ 1960 నేపథ్యంలో ఉంటుందట. వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడట. మూడు భాషల్లో రూపొందే ఈ సినిమాను గోపికృష్ణా మూవీస్, యు.వి. క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2019 చివరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments