ప్రభాస్ కొత్తగా నేర్చుకుంటున్నాడు...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఆకాశాన్నంటింది. ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సాహో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
విఎఫెక్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్‌ను ఇందులో వివియోగిస్తున్నారు. సాహో సినిమాలో అండర్ వాటర్‌లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందట. అందుకోసమని ప్రభాస్ స్కూబా డైవింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడట.
రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా రూపొందుతుండగా, యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com