20 శాతం పారితోషకం మాత్రమే తీసుకున్నా: ప్రభాస్

  • IndiaGlitz, [Saturday,August 17 2019]

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సాహో'. ఆగస్ట్ 30న సినిమా విడుదల కానుంది. రూ.350కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించారు. మరి హీరో ప్రభాస్‌కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో అని అందరూ భావించారు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పిన మాటలు విని అందరూ షాకయ్యారు.

ఎందుకంటే 'సాహో' సినిమాను తన స్నేహితులే నిర్మించారని, బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువైందన్నారు ప్రభాస్. బడ్జెట్ ఎక్కువ అవడంతో నేను రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదని, సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ నుండి ఇరవై శాతం మాత్రమే తీసుకున్నానని తెలిపారు ప్రభాస్. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్, చంకీ పాండే, మందిరా బేడి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

More News

రియల్ ‘హీరో’ మీరే సారూ.. 500 ఇళ్లు కట్టిస్తున్న ‘నానా’!

బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈయనకుండే సేవాగుణం అలాంటిది మరి.

నెటిజన్‌ కౌంటర్‌కి మాధవన్ రిప్లై

తమిళ నటుడైన మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈయన నటించిన తమిళ చిత్రాలు సఖి, చెలి, యువ చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలను సాధించాయి.

'అ!' సీక్వెల్‌లో టాప్ స్టార్స్

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మాతగా మారి రూపొందిన చిత్రం `అ!`. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం డీసెంట్ విజయాన్ని అందుకుంది.

హీరోయిన్‌పై సీరియస్ అయిన యూనిట్

హీరోయిన్ రష్మిక మందన్నాపై  కోలీవుడ్‌కి చెందిన ఓ చిత్ర యూనిట్ గుర్రుగా ఉందని టాక్. ఎందుకంటే..

తలపై తుపాకులు పెట్టినా జ‌న‌సేనను ఏ పార్టీతో క‌ల‌పం!

జ‌న‌సేన పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీల్లాంటిది కాద‌ని, పేరుకి ప్రాంతీయ పార్టీ అయిన‌ప్పటికీ ప్రతి భార‌త పౌరుడిని సమంగా చూడాల‌న్న ల‌క్ష్యంతో,