హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ లో ప్రభాస్.. యాక్షన్ హీరోతో కలసి..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖ్యాతి రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తం అవుతోంది. బాహుబలితో ప్రభాస్ ఇప్పటికే ఇండియా మొత్తం సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. మరి కొన్ని పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ప్రభాస్ ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచే విధంగా ఓ వార్త వైరల్ అవుతోంది.
ప్రభాస్ హాలీవుడ్ లో కూడా అవకాశం అందుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కానీ ఇది నిజం అంటూ ప్రభాస్ అభిమానులు ఈ న్యూస్ ని వైరల్ చేస్తున్నారు. హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న యాక్షన్ మూవీ ప్రాంఛైజీ 'మిషన్ ఇంపాజిబుల్ 7'లో ప్రభాస్ కు అవకాశం దక్కిందట.
ఇదీ చదవండి: మెగాస్టార్ మాటిచ్చాడంటే.. నిలబడతాడంతే..
ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ తో కలసి ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మిషన్ ఇంపాజిబుల్ దర్శకుడు క్రిస్టెఫెర్ మెక్వారి ప్రభాస్ తో సంప్రదింపులు జరిపి ఓకె చేయించాడట. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
ప్రభాస్ నుంచి వరుసగా క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అలాగే ఆదిపురుష్, సలార్ చిత్రాలు కూడా రెడీ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి ప్లాన్ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com